Raviteja: వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మాహారాజా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఏసీపీగా రవితేజ లుక్ అదిరింది..

తాజాగా మాస్ మాహారాజా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్. ఇందులో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించనున్నారు.

Raviteja: వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మాహారాజా ఫస్ట్ లుక్ వచ్చేసింది.. ఏసీపీగా రవితేజ లుక్ అదిరింది..
Ravijteja
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2022 | 11:59 AM

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి భారీ అంచనాలు ఉన్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చాలా కాలం తర్వాత చిరు, రవితేజ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి నెలకొంది. ఇక ఈ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించడానికి సిద్ధమౌతున్నారు ఈ ఇద్దరు స్టార్స్. దర్శకుడు బాబీ కొల్లి (కేఎస్ రవీంద్ర) ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్, ఫస్ట్ సింగిల్ కూడా సినిమాపై బజ్ పెంచాయి. ఇక ఈ సినిమాలో రవితేజ ఫస్ట్ లుక్ గురించి ఇటీవల అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ ఫస్ట్ లుక్‌ కి సంబంధించిన అనౌన్స్ మెంట్ చేస్తూ మేకర్స్ పవర్-ప్యాక్డ్ ప్రీ-లుక్ పోస్టర్‌ ను విడుదల చేశారు.

తాజాగా మాస్ మాహారాజా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు వాల్తేరు వీరయ్య చిత్రయూనిట్. ఇందులో రవితేజ ఏసీపీ విక్రమ్ సాగర్ పాత్రలో కనిపించనున్నారు. ఓ చేతిలో మేక పిల్లను పట్టుకుని మరో చేతిలో గొడ్డలి పట్టుకుని సిలిండర్‌ని లాగుతున్న రవితేజ.. పవర్ ఫుల్ యాక్షన్‌కు సిద్ధమైనట్లు కనిపించారు. పవర్ కు కొత్త పేరే ఏసీపీ విక్రమ్ సాగర్ అంటూ పోస్టర్ పై రాసుకొచ్చారు.. అతని బ్యాగ్రౌండ్ కేవలం హార్ట్ వర్క్.. అతని సపోర్ట్ ప్రేమించే మాస్ అంటూ ట్వీట్ చేశారు చిరు. ప్రస్తుతం రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ నెట్టింట వైరలవుతుంది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా, ప్రస్తుతం యూరప్‌ లో లీడ్‌ పెయిర్‌పై పాటల చిత్రీకరణ జరుగుతోంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు