Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పేరు మారింది.. ఇకపై భవదీయుడు భగత్‏సింగ్ కాదు..

తాజాగా భవధీయుడు భగత్ సింగ్ టైటిల్ మారుస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అలాగ్ పవర్ స్టార్ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా పేరు మారింది.. ఇకపై భవదీయుడు భగత్‏సింగ్ కాదు..
Ustaad Bhagath Singh
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 11, 2022 | 12:12 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తోన్న పవన్.. ఇటీవలే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా..శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇక మరోవైపు.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. వీరిద్దరి కాంబోలో రాబేయే సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అంటూ టైటిల్ తోపాటు.. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. రెండ్రోజుల క్రితం హరి హర వీరమల్లు సెట్ లో పవన్ తో ముచ్చటించారు హరీష్. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా భవధీయుడు భగత్ సింగ్ టైటిల్ మారుస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. అలాగ్ పవర్ స్టార్ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

భవదీయుడు భగత్ సింగ్ సినిమాను ఉస్తాద్ భగత్ సింగ్ గా మారుస్తున్నట్లు తెలియజేస్తూ.. పవన్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మనల్ని ఎవడ్రా ఆపేది అనే ట్యాగ్ లైన్ తోపాటు.. ఈసారి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. అనే మూవీ థీమ్ లైన్ కూడా ఇచ్చారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండ గా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

ఇవి కూడా చదవండి

అయితే ఈ సినిమా గురించి డైరెక్టర్ హరీష్ ట్వీట్ చేయగానే.. పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన తేరి సినిమాను హరీష్ రీమేక్ చేయనున్నట్లుగా టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చే శారు. ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచన మానుకోవాలని.. ఆ మూవీ రీమేక్ అంటూ ప్రకటన మాత్రం రావొద్దంటూ సోషల్ మీడియా వేదికగా దర్శకుడికి డిమాండ్ చేశారు. దీంతో నెట్టింట #WeDontWantTheriRemake హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.