Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rama Prabha : అన్నిపోగొట్టుకొని రోడ్డున పడ్డా.. ఆ సమయంలో ఆ హీరో చేసిన సాయం నేను ఎప్పటికి మరచిపోలేను..

ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు రమాప్రభ. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చాలా సినిమాల్లో కనిపించారు రమాప్రభ ముఖ్యంగా పూరిజగన్నాథ్ తెరకెక్కించిన సినిమాల్లో దాదాపు అన్ని సినిమాల్లో నటించారు రామ ప్రభ.

Rama Prabha : అన్నిపోగొట్టుకొని రోడ్డున పడ్డా.. ఆ సమయంలో ఆ హీరో చేసిన సాయం నేను ఎప్పటికి మరచిపోలేను..
Rama Prabha
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Dec 15, 2022 | 11:10 AM

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కండక్టర్ నుంచి తమిళనాట సూపర్ స్టార్‌గా ఎదిగిన రజినీకాంత్ జీవితం ఎంతోమందికి స్పూర్తిదాయకం. నటనలో మాత్రమే కాదు స్టైల్‌లో కూడా రజినీకి సాటి ఎవ్వరూ లేరు. ఇప్పటికీ మాస్‌లో యమా ఫ్యాన్ ఫాలోయింగ్ తలైవా సొంతం. ప్రపంచవ్యాప్తంగా రజినీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తన మ్యానరిజమ్స్‌తోనే బాక్సాఫీస్ షేక్ చేయగల వన్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్. నేడు మన సూపర్ స్టార్, అందరి తలైవా రజినీకాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన మంచితనం గురించి సీనియర్ నటి రమాప్రభ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం..

లేడీ కమెడియన్‌గా ఆమె నటనతో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది రమాప్రభ. అంతే కాదు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించారు ఆమె. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చాలా సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

”ఒక నటుడు నన్ను దారుణంగా మోసం చేశాడు. అతని కారణంగా ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను. నటిగా బాగానే సంపాదించాను. కానీ ఒకడిని నమ్మి మొత్తం పోగొట్టుకున్నా అని ఆవేదన వ్యక్తం చేశారు. చేతిలో చిల్లిగవ్వకూడా లేకుండా రోడ్డున పడ్డాను అని రమాప్రభ అన్నారు. అయితే ఆ దిక్కుతోచని సమయంలో సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను సాయం అడుగుదామని వెళ్ళా.. ఆయన నాకు దారి ఖర్చులు ఇస్తే చాలు అనుకోని సాయం చేయమని అడిగాను.. కానీ ఆయన వెంటనే నాకు 40వేల రూపాయిలు చేతిలో పెట్టారు. అప్పట్లో 40వేలంటే మాటలు కాదు. అడిగిన వారికి లేదనుకుండా సహాయం చేసే వ్యక్తిత్వం ఉన్న మనిషి రజినీకాంత్” అని ఆమె అన్నారు. ఆయన చేసిన  సహాయం నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిదని రమాప్రభ చెప్పుకొచ్చారు. కాగా, తాను జీవితంలో మర్చిపోలేని సాయం చేసిన సూపర్‌స్టార్‌పై ప్రశంసలు కురిపించిన రమాప్రభ.. తనను మోసం చేసిన నటుడు ఎవరన్నది మాత్రం చెప్పలేదు.

ఇవి కూడా చదవండి