Rajinikanth Birthday: రజినీకాంత్ కోసం ఏడు రోజులు ఉపవాసం ఉన్న శ్రీదేవి.. ఎందుకో తెలుసా..

ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకునే రజినీ పుట్టిన రోజు నేడు. 72 ఏళ్ల వయసున్న ఈ స్టార్ హీరో.. ఇప్పటికీ విరామం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కెరీర్‏లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజినీ.

Rajinikanth Birthday: రజినీకాంత్ కోసం ఏడు రోజులు ఉపవాసం ఉన్న శ్రీదేవి.. ఎందుకో తెలుసా..
Rajinikanth Sridevi
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 12, 2022 | 10:46 AM

సూపర్ స్టార్ రజినీ కాంత్.. సౌత్‏లోనే కాదు.. నార్త్‏లోనూ అత్యంత క్రేజ్ ఉన్న తారలలో ఒకరు. ఆయన స్టైల్ అండ్ యాటిట్యూడ్‏కు ఇప్పటి యువత కూడా ఫిదా కావాల్సిందే. ఓ సామాన్య వ్యక్తిగా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి చిన్న చిన్న విషాలతో వెండితెరపై సందడి చేసి.. తక్కువ సమయంలోనే సూపర్ స్టార్‏గా ఎదిగారు. ఎన్నో సూపర్ హిట్స్.. బాక్సాఫీస్‏ను షేక్ చేసిన చిత్రాలు.. యాక్షన్.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రమే కాదు.. ఆధ్యాత్మిక చిత్రాలతోనూ మెప్పించారు. ఫ్యాన్స్ ముద్దుగా తలైవా అని పిలుచుకునే రజినీ పుట్టిన రోజు నేడు. 72 ఏళ్ల వయసున్న ఈ స్టార్ హీరో.. ఇప్పటికీ విరామం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన కెరీర్‏లో ఎంతో మంది హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు రజినీ. కానీ ఓ హీరోయిన్ మాత్రం సూపర్ స్టార్ కోసం ఏకంగా 7 రోజులు ఉపవాసం ఉన్నారట. ఇంతకీ ఎవరా హీరోయిన్ ? ఎందుకు ఉపవాసం ఉంది ? తెలుసుకుందామా .

సూపర్ స్టార్ రజినీ కాంత్ కోసం ఏకంగా ఏడు రోజులు ఉపవాసం ఉన్న హీరోయిన్ మరెవరో కాదు… అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవి. వీరిద్దరి కాంబినేషన్ లో దాదాపు 25 సినిమాలు వచ్చాయి. కన్నడ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో వీరిద్దరు కలిసి నటించిన చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఫరిష్టే.. చాల్ బాజ్, భగవాన్ దాదా, జుల్మ, గెర్ లేగీ వంటి చిత్రాలు నటించారు. అయితే తన కోసం శ్రీదేవి 7 రోజులు ఉపవాసం ఉండి దీక్ష చేసిందని రజినీ స్వయంగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 2011 సంవత్సరంలో రజినీ ప్రధాన పాత్రలో రానా సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో తన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయనను చికిత్స కోసం సింగపూర్ తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ విషయం తెలియగానే శ్రీదేవి మనోవేదనకు గురయ్యారు. రజినీ ఆరోగ్యం మెరుగుపడేందుకు షిర్డీ వెళ్లారు.

ఇవి కూడా చదవండి

షిర్డీని సందర్శించిన తర్వాత ఆయన కోసం 7 రోజులపాటు నిరాహార దీక్ష చేశరు. రజినీ కోలుకోవడానికి నిత్యం దైవాన్ని స్మరించుకున్నారట. ఇక కొద్ది రోజులకు రజినీ పూర్తిగా కోలుకుని భారత్ కు తిరిగివచ్చిన వెంటనే.. తన భర్త బోనీ కపూర్ తో కలిసి తలైవా ను చూసేందుకు వెళ్లారట. రజినీని తిరిగి మాములుగా చూసి శ్రీదేవి భావోద్వేగానికి గురయ్యారట.

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు