Pushpa 2: ఆ విషయంలో ఇక తగ్గేదేలే.. అల్లు అర్జున్‌తో కలిసి నటించబోతున్న మెగా ఫ్యామిలీ హీరో..?

పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్ అగ్ర హీరో ఇంకా చెప్పుకోవాలంటే మెగా ఫామిలీ నుంచి మరో స్టార్ పనిచేయనున్నారని ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. సినిమా డైరెక్టర్ సుకుమార్ సీక్వెల్‌ను భారీ స్థాయిలో.. మరింత..

Pushpa 2: ఆ విషయంలో ఇక తగ్గేదేలే.. అల్లు అర్జున్‌తో కలిసి నటించబోతున్న మెగా ఫ్యామిలీ హీరో..?
Ram Charan In Pushpa
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2022 | 8:25 AM

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు అంతా కూడా పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్పరాజు అనే ఊర మాస్ పాత్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను బాగా చూపించాడు డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన సౌత్ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేయడమే బాలీవుడ్‌ను కూడా ఓ ఊపు ఊపేసింది అనడంలో అతిశయోక్తి లేనే లేదు. పుష్ప సినిమా అంతా ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ మరో ఎత్తు అన్నట్లుగా సినీమాను చిత్రీకరించాడు సుకుమార్. బహుశా అందుకేనేమో పుష్ప సీక్వెల్ కోసం అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరి చూస్తున్నారు. ఇప్పటికే పుష్ప 2 లో ఫహద్ ఫాసిల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని పుష్ప సినిమా ద్వారా తెలుసుకున్నాం.

అయితే పుష్ప 2 సినిమా కోసం టాలీవుడ్ అగ్ర హీరో ఇంకా చెప్పుకోవాలంటే మెగా ఫామిలీ నుంచి మరో స్టార్ పనిచేయనున్నారని ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది. సినిమా డైరెక్టర్ సుకుమార్ సీక్వెల్‌ను భారీ స్థాయిలో, మరింత వినోదాత్మకంగా రూపొందించాలని నిశ్చయించుకున్నారు.  ఆ నేపథ్యంలోనే పుష్ప సినిమాలో నటించడానికి రామ్ చరణ్‌ను అతిథి పాత్రలో నటించేలా ప్రయత్నాలు చేస్తున్నారని  నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై పుష్ప టీమ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటనలు లేనప్పటికీ ఈ ఇద్దరు మెగా హీరోలను ఒకే స్క్రీన్‌పై మరో సారి చూడాలని అభిమానులు ఆరాటపడుతున్నారు. ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే.

కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప విడుదలైన రోజు నుంచే రికార్డులను తిరగరాస్తూ బాక్సాఫిస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పుష్ప ది రైజ్ సినిమా గురించి ఈ ఏడాది అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అల్లు అర్జున్  మాట్లాడుతూ.. ‘‘సినీ ఇండస్ట్రీల మధ్య పోటీ ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.  సినీ రంగం అభివృద్ధికి ఇది కచాలా అవసరం. కానీ ఈ సినిమా (పుష్ప: ది రైజ్) అన్ని సినీ ఇండస్ట్రీలకు సంబంధించినది. మనమందరం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పిల్లలం. ఇది భారతీయ సినిమా విజయం అని మనందరికీ గర్వకారణం. ఈ కరోనా కష్ట సమయంలో దేశానికి  వినోదాన్ని పంచుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాము’’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే