Protein Levels: మన ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం.. కానీ శరీరంలో వాటి స్థాయి ఎక్కువగా ఉంటే..? తెలుసుకుందాం రండి..

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు అనే ఈ మూడు రకాల పోషకాలు చాలా అవసరం. అందుకే  మన రోజువారీ ఆహారంలో ఈ మూడు రకాల పోషక పదార్థాలు తప్పని సరిగా.. లేకపోతే..

Protein Levels: మన ఆరోగ్యానికి ప్రోటీన్లు చాలా అవసరం.. కానీ శరీరంలో వాటి స్థాయి ఎక్కువగా ఉంటే..? తెలుసుకుందాం రండి..
Protein Food
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 11, 2022 | 6:37 PM

మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు అనే ఈ మూడు రకాల పోషకాలు చాలా అవసరం. అందుకే  మన రోజువారీ ఆహారంలో ఈ మూడు రకాల పోషక పదార్థాలు తప్పని సరిగా ఉండాలి. వేగవంతమైన బరువు తగ్గడానికి కూడా ఇవి చాలా ఉపకరిస్తాయి. కానీ చాలా సందర్భాలలో అనేక మంది ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని తింటారు. అలా అధిక మొత్తంలో ప్రోటీన్ తినడం వల్ల శరీరంలో వివిధ దుష్ప్రభావాలు ఏర్పడతాయని మీకు తెలుసా..? పోషకాహార నిపుణుల ప్రకారం శరీర అవసరాలకు అనుగుణంగా ప్రోటీన్ తీసుకోవడం ఉత్తమం.

అయితే వయోజనులలో కిలో బరువుకు 0.8 గ్రాముల ప్రోటీన్ అవసరం. నిత్యం వ్యాయామం చేసేవారు, జిమ్‌కి వెళ్లేవారికి  కిలో బరువుకు 1.3 గ్రాముల నుంచి 1.6 గ్రాముల ప్రొటీన్లు అవసరం. కానీ దానికంటే ఎక్కువ ప్రొటీన్లు తీసుకోవడం వల్ల అనేక సమస్యలు కలుగుతాయి. మరి మన శరీరంలో ప్రోటీన్ స్థాయి పెరిగిందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రోటీన్ స్థాయి క్రమబద్ధీకరించేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు..

1) మీరు ఎంత ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే, మీ శరీరానికి అంత ఎక్కువ నీరు అవసరం. ప్రోటీన్లకు అనుగుణంగా నీరు తాగడం మంచిది. మీకు సాధారణంగా వేసే దాహం కంటే అదనపు దాహం అనిపిస్తే మీరు ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తింటున్నారని మీకు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

2) అదనపు ప్రోటీన్ తినడం రక్తంలో నైట్రోజన్ స్థాయిలను పెంచుతుంది. మూత్రపిండాలు మూత్రం ద్వారా శరీరం నుంచి స్థాయికి మించి నైట్రోజన్‌ను తొలగిస్తాయి. దీంతో కిడ్నీలపై ఒత్తిడి ఏర్పడి శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాదు కిడ్నీలను కూడా దెబ్బతీస్తుంది.

3) శరీరంలో నీరు లేకపోవడం వల్ల తల తిరగడం, అలసట, తలనొప్పి వంటి సమస్యలు కలుగుతాయి. ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

4) అధిక ప్రోటీన్ తీసుకోవడం బరువు పెరగడానికి దారితీస్తుంది. ఈ క్రమంలో ఆహారం సరిగ్గా తీసుకోకపోతే, బరువు తగ్గడం కష్టం.

5) ప్రొటీన్ స్థాయి పెరగడంతో పాటు కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం తగ్గితే శరీరంలో కీటోసిస్ సమస్య వస్తుంది. ఫలితంగా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఆ సమయంలో మజాన్ లేదా మౌత్ ఫ్రెషనర్ కూడా పనిచేయవు.

6) ఎక్కువ ప్రొటీన్లు, తక్కువ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల శరీరంలో పీచుపదార్థం కూడా తగ్గుతుంది. ఇంకా మీరు ఎంత తక్కువ పీచు తీసుకుంటే జీర్ణ సమస్యలు, మలబద్ధకం, ఇతర అనారోగ్యాలు అంత ఎక్కువగా కనిపిస్తాయి.

7) ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారంగా రెడ్ మీట్ ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్, గుండె జబ్బుల సమస్యలు రావచ్చు. మీరు పాల ఉత్పత్తులను ఎక్కువగా తింటే డయేరియా ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు,  కొవ్వుల మొత్తాన్ని తగినంతగా ఉంచినంత వరకు ప్రోటీన్ సమస్య కాదు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ..