AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Post: ఇలా కూడా బస్సు ఎక్కవచ్చా..? మీరు మాత్రం ఇలా ఎన్నటికీ ప్రయత్నించకండి..

సోషల్ మీడియా అనేది ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేని ఓ వేదిక. ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు కొన్ని మిమ్మల్ని ఒక్కసారిగా షాక్‌కి గురిచేస్తే, మరికొన్ని వీడియోలు మీకు పొట్ట చెక్కలయ్యేలా... ఇంకా నవ్వించేలా..

Viral Post: ఇలా కూడా బస్సు ఎక్కవచ్చా..? మీరు మాత్రం ఇలా ఎన్నటికీ ప్రయత్నించకండి..
Woman Entering Into Bus
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 11, 2022 | 5:40 PM

Share

సోషల్ మీడియా అనేది ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పలేని ఓ వేదిక. ఈ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు కొన్ని మిమ్మల్ని ఒక్కసారిగా షాక్‌కి గురిచేస్తే, మరికొన్ని వీడియోలు మీకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించేలా ఉంటాయి. అయితే చాలా కొద్ది వీడియోలు మాత్రమే మనల్ని షాక్‌కు గురిచేయడమే పడిపడి నవ్వుకునేలా ఉంటాయి. అవును. అలాంటి వీడియోలు చాలా అరుదుగా నెట్టింట ప్రత్యక్షమవుతాయి. ఆ అరుదైన వీడియోలలో చేరేందుకే అనుకుంటా ఇప్పుడు నెట్టింట ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ యువతి తాను ప్రయాణించే బస్సు ఎక్కుతుంది. బస్సులోకి యువతి ఎక్కడమే వైరల్ వీడియోనా అంటే కానే కాదు. ఎందుకంటే ఆ యువతి ఎక్కింది బస్ డోర్ నుంచి కాదు. పైగా ఆగిన బస్ అసలే కాదు. ఏకంగా కదిలే బసులోకి దాని కిటికీలోంచి ఎక్కేసింది ఆ యువతి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది.

అయితే నెటిజన్లు మాత్రం ఇది చాలా ప్రమాదకరమని, బస్సు ఎక్కే క్రమంలో ఆ యువతి టైర్లలో పడిపోయి ఉండవచ్చునని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తమ తమ అభిప్రాయాలను కామెంట్ చేస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో.. చాలా మంది ప్రయాణికులు బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉండటం మనం చూడవచ్చు. కొంతసేపటికి అక్కడికి బస్సు రావడంతో అందరూ అందులో ఎక్కడం మొదలు పెట్టారు. అప్పటికే బస్సు నిండిపోయింది. అప్పుడే కెమెరా ఫోకస్ ఒక అమ్మాయి వైపు వెళ్లింది. ఆమె బస్సు రెయిలింగ్ పట్టుకుని కిటికీ నుంచి బస్సు ఎక్కగానే.. చుట్టూ నిలబడిన వారు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ దృశ్యాన్ని చూసిన అక్కడి ప్రజలు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న ఇన్‌స్టా పోస్ట్..

View this post on Instagram

A post shared by memes comedy (@ghantaa)

కాగా, దీనికి సంబంధించిన వీడియోలోని యువతిపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ అమ్మాయికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఆ డ్రైవర్ జీవితం మరింత దారుణంగా ఉండేదని యూజర్లు కామెంట్స్‌లో చెబుతున్నారు. అయితే ప్రాణాలను ఫణంగా పెట్టి ఈ విధంగా బస్సులోకి ప్రవేశించకూడదని వారు సూచిస్తున్నారు. ఈ వీడియోను కొందరు తమాషాగా చూస్తుండగా, మరికొందరు ఈ వీడియోను చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..