Snoring: గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీకు ఉపకరించే ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి..

చాలా మంది గురక సమస్య నుంచి బయట పడేందుకు వారు చేసే అనేక ప్రయత్నాలో భాగంగా మెడిసిన్లను కూడా వాడుతుంటారు. కానీ చాలా వరకూ మెడిసిన్లతో ఆ సమస్య నయం కాకపోవచ్చు. అయితే సులభమైన ఓ వ్యాయామం.. అలా చేయడం ద్వారా..

Snoring: గురక సమస్యతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే మీకు ఉపకరించే ఈ వ్యాయామం గురించి తెలుసుకోండి..
Snoring
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 11, 2022 | 3:45 PM

ప్రశాంతంగా పడుకొని ఉన్నప్పుడు చిన్న శబ్దం విన్నా మనకు ఉన్న నిద్ర కూడా పోతుంది. అందుకే నిద్రపోయేటప్పుడు చాలా మంది  చెవులకు అడ్డంగా ఏమైనా పెట్టుకొని పడుకుంటారు. అలా మీరు పడుకొని ఉన్నప్పుడు మీ భాగస్వామి లేదా ఇతరుల ఎవరైనా గురక పెట్టవచ్చు. లేదా మీకే గురక పెట్టే సమస్య ఉండవచ్చు. అలా గురక పెట్టడం వల్ల నిద్ర కూడా సరిపోయినట్లు ఉండదు. ఇతరులు గురక పెడితే మనకు నిద్రాభంగం.. మనం పెట్టినా ఇతరులు మనల్ని నిద్రలేపేందుకు నిద్రాభంగం కలిగిస్తారు. అందువల్లనే చాలా మంది గురక సమస్య నుంచి బయట పడేందుకు వారు చేసే అనేక ప్రయత్నాలో భాగంగా మెడిసిన్లను కూడా వాడుతుంటారు. కానీ చాలా వరకూ మెడిసిన్లతో ఆ సమస్య నయం కాకపోవచ్చు. అయితే సులభమైన ఓ వ్యాయామం ద్వారా గురక సమస్యను పరిష్కరించుకోవచ్చు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం స్వర తంతువుల కండరాల బలహీనత వల్ల గురక సమస్య వస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి కేవలం వ్యాయామం చేస్తే సరి. అదేమిటో తెలుసుకునే ముందు అసలు గురకకు కారణాలు తెలుసుకుందాం..

గురకకు కారణాలు:

గురక సమస్య వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. సాధారణంగా నిద్రపోయేటప్పుడు మన నాలుక, గొంతు, నోరు, శ్వాసనాళాల్లో ఏదో ఒక అడ్డంకి లేదా ఏదైనా కంపనం ఏర్పడినప్పుడు గురక శబ్దం రావడం ప్రారంభమవుతుంది. మనం నిద్రలో ఉన్నప్పుడు మన శరీరంలోని ఈ భాగాలు విశ్రాంతి, సంకోచం, విశ్రాంతి పొందుతాయి. దీని కారణంగా ఇది జరుగుతుంది. కొందరు శరీర బరువు పెరిగినా కూడా తరచుగా గురక సమస్యతో బాధపడుతుంటారు. ఇదే కాకుండా దీర్ఘకాలంగా పొగతాగడం, అతిగా మద్యం సేవించడం లేదా నిద్రలో గొంతుపై ఎలాంటి ఒత్తిడి కలిగినా కూడా గురక వస్తుంది.

ఇవి కూడా చదవండి

గురకను అధిగమించేందుకు వ్యాయామం:

గురకను సమస్యను అధిగమించేందుకు వ్యాయామాలను అభ్యసించమని జీవశాస్త్రజ్ఞుల సూచిస్తున్నారు. గురక కోసం చేసే ఈ వ్యాయమం ఎలా చేయాలంటే.. మీ నాలుకను పంటి ముందు భాగంలో దిగువకు తాకడానికి ప్రయత్నించండి. ఆపై లోపలికి విస్తరించేటప్పుడు ‘క్లిక్’ శబ్దం చేయండి. మీరు ఈ ధ్వనిని బిగ్గరగా చేయవచ్చు. ఇలా చేయడం వల్ల కాలక్రమేణా కండరాలు బలంగా ఉంటాయి. ఇలా కొన్ని రోజుల పాటు నిరంతరం ఆచరించడం వల్ల గురక సమస్య కూడా అనతి కాలంలోనే దూరమవుతుంది. ఈ వ్యాయామం ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..