Dates for Health: ఖర్జూరాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే మీరు తినకుండా ఆగలేరంతే..

సాధారణంగానే ఖర్జూరం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజూ ఖర్జూరం తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయాని పెద్దలు కూడా.. అందుకే ఫిట్‌గా ఉండాలనుకునేవారు..

Dates for Health: ఖర్జూరాలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..? తెలిస్తే మీరు తినకుండా ఆగలేరంతే..
Dates
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 11, 2022 | 3:18 PM

సాధారణంగానే ఖర్జూరం మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ప్రతిరోజూ ఖర్జూరాలు తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయాని పెద్దలు కూడా చెబుతుంటారు. అందుకే ఫిట్‌గా ఉండాలనుకునేవారు కూడా ఖర్జూరాలను లేదా ఎండు ఖర్జూరాలను నిత్యం తింటూ ఉంటారు. అందుకే అందరికీ అందుబాటులో ఉండేలా మార్కెట్‌లలోని అన్ని షాపులలో ఖర్జూరాలు పుష్కలంగా దొరుకుతాయి. ఖర్జూరం తినడం వల్ల ఫిట్‌గా ఉండడమే కాక అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఖర్జూరాలను నిత్యం తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో అనేక పోషకాలు పుష్కలంగా ఉండడం వల్ల శరీర వ్యాధి నిరోధక శక్తి కూడా రెట్టింపు అవుతుంది. ఖర్జూరం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఖర్జూరంలో ఐరన్: అనేక విధాలుగా ఖర్జూరాలు అందరికీ ప్రయోజనకరంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు, పిల్లలు దీనిని నిత్యం తీసుకుంటే ఎప్పటికీ రక్తహీనత సమస్య ఎదురవదు. 100 గ్రాముల ఖర్జూరంలో 0.90 మి.గ్రా ఐరన్ ఉంటుంది. అందుకే రక్తహీనత ఉన్నట్లయితే రోజూ ఖర్జూరం తినండి.

డయేరియా: డయేరియా రోగికి ఖర్జూరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇందులో ఉండే పొటాషియం డయేరియా సమస్య నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది.

ఇవి కూడా చదవండి

రక్తపోటు నియంత్రణ: ఖర్జూరం మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే ఇందులో తక్కువ మొత్తంలో సోడియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించేందుకు పనిచేస్తుంది.

మలబద్ధకం: ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఖర్జూరాలను రాత్రి నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నిద్రలేచి ఖర్జూరం కరిగిన రసాన్ని తాగండి. ఇలా చేస్తే మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..