AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleeplessness: మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..? మీరు ఈ విధంగా చేస్తే సమస్యను ఇట్టే అధిగమించవచ్చు.. అసలు ఏం చేయాలంటే..?

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలే ఉన్నాయి. వాటిల్లో శారీరక, మానసిక వ్యాధులు, రోజూ ఒత్తిడికి గురవడం, వాతావరణంలో మార్పులు ప్రధాన కారణాలు. వీటికి అదనంగా..

Sleeplessness: మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా..? మీరు ఈ విధంగా చేస్తే సమస్యను ఇట్టే అధిగమించవచ్చు.. అసలు ఏం చేయాలంటే..?
Insomnia
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 08, 2022 | 9:54 PM

Share

ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అందుకు అనేక కారణాలే ఉన్నాయి. వాటిల్లో శారీరక, మానసిక వ్యాధులు, రోజూ ఒత్తిడికి గురవడం, వాతావరణంలో మార్పులు ప్రధాన కారణాలు. వీటికి అదనంగా మధ్యాహ్నం అతిగా నిద్రించడం, ఆహారపు అలవాట్లలో మార్పులు, అతిగా భోజనం చేయడం, టీ, కాఫీలు ఎక్కువగా తాగడం, కీళ్ల నొప్పులు, మధుమేహం, బిజీ లైఫ్ స్టైల్ వంటివి తదితర కారణాలు. ఈ కారణాల వల్లనే ఏ వ్యక్తికి అయినా నిద్రలేమి వస్తుంటుంది. అలాగే శరరీంలో నీటి శాతం బాగా తగ్గినా నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్యలను అధిగమించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తుంటారు చాలా మంది.  ఈ క్రమంలోనే నిద్రలేమి సమస్యకు పాటించాల్సిన చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నిద్రలేమి సమస్య ఉన్నవారు మధ్యాహ్నం నిద్రించకపోవడం మంచిది. అంతగా కావాలంటే 30 నిమిషాల పాటు చిన్న కునుకు తీయవచ్చు.. అంతే. అయితే గర్భిణీలు, వృద్ధులు మధ్యాహ్నం నిద్రించవచ్చు. ఇక వ్యాయామం చేసిన వెంటనే కాకుండా ఒక గంట సేపు అయ్యాక నిద్రిస్తే మంచిది. నిద్రలేమితో బాధపడేవారు పాలు, పెరుగు, చెరుకు రసం, అరటి పండ్లు, యాపిల్‌ పండ్లు, నారింజ, దానిమ్మ వంటి వాటిని తీసుకుంటే మేలు కలుగుతుంది. అలాగే శరీరాన్ని నూనెతో మసాజ్‌ చేసి గోరు వెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. నూనెతో తలకు బాగా మర్దనా చేసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అరికాళ్లలో లావెండర్‌ నూనె లేదా తేనెతో బాగా మర్దనా చేసుకోవాలి. అలా చేయడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.

గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్‌ అశ్వగంధ చూర్ణం కలిపి రోజూ రాత్రి పూట పడుకునేందుకు 2 గంటల ముందు తాగితే  బాగా నిద్ర పడుతుంది. రాత్రి భోజనం చేసిన తరువాత పాలలో చిటికెడు జాజికాయ చూర్ణం లేదా బాదంపప్పు, దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా కలిపి తాగితే నిద్ర బాగా వస్తుంది. అలాగే గసగసాలను వస్త్రంలో కట్టి వాసన పీల్చడం వల్ల కూడా నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రిపూట జాజిపూలను దిండు కింద పెట్టుకుంటే నిద్ర బాగా వస్తుంది. జాజిపూల తైలం లేదా బాదం నూనెతో తలకు మర్దనా చేసుకోవడం వల్ల కూడా నిద్రలేమి సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..