Lemon : నిమ్మరసాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే.. మీ ముఖ చర్మం మెరిసిపోతుంది.. అయితే ఎలా ఉపయోగించాలంటే..

మన తినే ఆహారాన్ని నిమ్మకాయ రుచిగా మార్చడమే కాదు మన ముఖాన్ని కూడా కాంతివంతంగా ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా నిమ్మరసంలో సిట్రిక్..

Lemon : నిమ్మరసాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే.. మీ ముఖ చర్మం మెరిసిపోతుంది.. అయితే ఎలా ఉపయోగించాలంటే..
Skin Care
Follow us

|

Updated on: Dec 08, 2022 | 8:31 PM

మన తినే ఆహారాన్ని నిమ్మకాయ రుచిగా మార్చడమే కాదు మన ముఖాన్ని కూడా కాంతివంతంగా ఉంచుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉన్నందున ఇది చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలోని పోషక మూలకాలు చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. సరైన విధంగా నిమ్మకాయ రసాన్ని మన ముఖం మీద రాస్తే చర్మ ఛాయను మెరుగుపరస్తుంది. అయితే నిమ్మకాయను ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మరసం, బియ్యప్పిండి బియ్యప్పిండిని నిమ్మరసంలో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖ చర్మం మృదువుగా మారడమే కాక మెరిసిపోతుంది. ఇందుకు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని దానికి నిమ్మరసం, అర చెంచా రోజ్ వాటర్ కలపండి. తర్వాత దానిని పేస్ట్‌లా చేయాలి.  ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో ముఖం కడిగేస్తే సరి.

నిమ్మకాయ, చక్కెర నిమ్మరసం, చక్కెర మిశ్రమాన్ని కూడా మన ముఖానికి రాసుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి, ఒక చెంచా చక్కెర తీసుకొని అందులో అలోవెరా జెల్, నిమ్మరసం మిక్స్ చేయాలి. తర్వాత దానిని పేస్ట్‌లా చేసుకోవాలి. అనంతరం ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయండి. 10 నిముషాలు పోయాక చేతులతో సున్నితంగా ముఖాన్ని స్క్రబ్ చేసి, శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. ఇలా చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ, గ్రీన్ టీ నిమ్మరసంతో గ్రీన్ టీ కలిపి ముఖానికి రాసుకోవచ్చు. దీని కోసం ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోండి. దానికి నిమ్మరసం, విటమిన్ ఈ క్యాప్సూల్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని మీ ముఖానికి అప్లై చేసి 5 నిమిషాల తర్వాత కడిగేస్తే మీ ముఖం మెరిసిపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
స్పోర్టీ లుక్లో అదరగొడుతున్న కొత్త ‘ప్లెజర్’.. ధర తక్కువ..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి