Orange for Diabetics: డయాబెటిస్ ఉన్నవారు నారింజ పండ్లను తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలుసుకుందాం రండి..
చలికాలంలో తియ్యని నారింజ పండ్లను తింటే ఆ మజా వేరు. విటమిన్ సీ అధికంగా ఉండే ఈ పండు రుచి అద్భుతమైన కలయిక. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే నారింజ చాలా ముఖ్యం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు..

Orange Feature
- చలికాలంలో తియ్యని నారింజ పండ్లను తింటే ఆ మజా వేరు. విటమిన్ సీ అధికంగా ఉండే ఈ పండు రుచి అద్భుతమైన కలయిక. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే ఆహారంలో నారింజను ఉంచుకోవడం చాలా ముఖ్యం. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు నారింజ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో మీకు తెలుసా..? అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- ‘అమెరికన్ డయాబెటిస్ సొసైటీ’ ప్రకారం.. నారింజ, మోసాంబి, నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పండ్లన్నింటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి.
- వైద్య నిపుణుల ప్రకారం.. నారింజ పుల్లని-తీపి రుచిలో ఉన్నప్పటికీ, అవి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయవు. ఇంకా చెప్పుకోవాలంటే నారింజలో అధికంగా ఉండే విటమిన్ సీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
- నారింజ గ్లైసెమిక్ సూచిక 52. కానీ ఈ పండులో చక్కెర ఎక్కువగా ఉండదు. దానికి అదనంగా, నారింజలో ఫైబర్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
- అయితే మధుమేహం ఉన్నవారు మార్కెట్లలో లభించే నారింజ రసం తాగకూడదు. ఆరెంజ్ జ్యూస్లో చక్కెరను విడిగా కలుపుతారు. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. అంతేకాక ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవు.
- మధుమేహ వ్యాధిగ్రస్తులు నారింజ రసంను ఇతర మార్గాల్లో తాగవచ్చు. ఒక చెంచా చియా విత్తనాలు, అవిసె గింజలను ఒక కప్పు నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత వాటిని అర గ్లాసు వాటర్, అర గ్లాస్ ఆరెంజ్ జ్యూస్లో కలపాలి. అలా తాగడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.










