Brain Stroke in Winter : ఇప్పుడు కూడా చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారా..? అయితే దాని వల్ల కలిగే సమస్యలేమిటో తెలుసుకోండి..
చన్నీళ్లతో స్నానం చేసే సమయంలో చలి కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి ఒక్కసారిగా రక్తపోటు పెరుగుతుంది. తలపై చల్లటి నీరు పోసుకుంటే.. శరీరాన్ని నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్ మెదడులో వేగంగా విడుదలై.. ఏం చేస్తుందంటే..?
చాలా మందికి కాలంతో పని లేకుండా చన్నీళ్లతో స్నానం చేయడమే ఇష్టం.. అలాగే మరికొందరికి వేడినీళ్లే నచ్చుతాయి. అయితే పలు అధ్యయనాల ప్రకారం.. చలికాలంలోనే ఎక్కువగా బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదు అవతున్నాయి. ముఖ్యంగా చన్నీళ్లతో స్నానం చేసినవారే బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారట. ఇంకా ఆ అధ్యయనాల ప్రకారం చన్నీళ్లతో స్నానం చేసే సమయంలో చలి కారణంగా రక్తనాళాలు కుంచించుకుపోయి ఒక్కసారిగా రక్తపోటు పెరుగుతుంది. తలపై చల్లటి నీరు పోసుకుంటే.. శరీరాన్ని నియంత్రించే హార్మోన్ అడ్రినలిన్ మెదడులో వేగంగా విడుదలవుతుంది. ఇది రక్తపోటుకు కూడా కారణమవుతుంది. ఆపై బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. చాలా మందికి చల్లటి నీళ్లలో స్నానం చేయడం అనేది సర్వసాధారణం. అయితే మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, స్థూలకాయం వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్‌కు లోనవుతారు.
చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించేందుకు కొన్ని చిట్కాలు..
- చలికాలంలో కూడా ఉదయాన్నే లేచి వ్యాయామం చేయండి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగా చేయండి.
- చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే చలికాలపు దుస్తులను అంటే స్వెట్టర్, జెర్కిన్ లాంటి వాటిని ఉపయోగించండి.
- సమతుల్య ఆహారం తీసుకోండి. శీతాకాలంలో తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినండి.
- చక్కెర ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలి.
- అధిక రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయించుకోండి.
- ధూమపానం, మద్యపానాన్ని మానేయడం మీ ఆరోగ్యానికే శ్రేయస్కరం. వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..