Garlic Benefits: దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? ఆ సమస్యలన్నీ పరార్‌

ఇలా ఎన్నో ప్రయోజనాలున్న వెల్లుల్లిని వంటగదిలోనే కాకుండా పడకగదిలో కూడా వాడుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని పడుకోండి. దీని వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

Garlic Benefits: దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని నిద్రపోతే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? ఆ సమస్యలన్నీ పరార్‌
Garlic Benefits
Follow us
Basha Shek

|

Updated on: Dec 08, 2022 | 6:18 PM

సాధారణంగా వెల్లుల్లిని ఆహార పదార్థాల్లో వాడటం మనం చూస్తుంటాం. వెల్లుల్లి మన శరీర ఆరోగ్యానికి చాలామంచిది. రోగనిరోధక శక్తిని పెంచి రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకోగల శక్తి వెల్లుల్లికి ఉంది. బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అధిక రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో పని చేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలున్న వెల్లుల్లిని వంటగదిలోనే కాకుండా పడకగదిలో కూడా వాడుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద వెల్లుల్లి రెబ్బలు పెట్టుకుని పడుకోండి. దీని వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గతంలో చాలామంది రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు దిండు కింద పెట్టుకుని పడుకునేవారు. దీనివల్ల నిద్రిస్తున్నప్పుడు హానికారక కీటకాలు, క్రిములు దగ్గరికి రావని వారి ప్రగాఢ నమ్మకం. అవును.. ఇది వాస్తవం. వెల్లుల్లి ఘాటైన వాసన కీటకాలను, క్రిములకు తరిమికొట్టే శక్తి ఉంటుంది. అంతేకాకుండా చెడు ఆలోచనలను దూరం చేసే శక్తి వెల్లుల్లికి ఉంది. చెడు కలలు కూడా రావు. అనారోగ్యాలు మీ దరి చేరవు. మిమ్మల్ని సానుకూలంగా ఆలోచించేలా చేస్తుంది. ఇక నిద్రలేమితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటెంట్ గాఢంగా నిద్ర పట్టేలా చేస్తుంది. ఇక శ్వాస సంబంధిత సమస్యలు కూడా దూరమవుతాయి.

నిరాశ నిస్పృహలకు చెక్‌..

ఇలా తలగడ కింద వెల్లుల్లిని ఉండే నిరాశ, నిస్పృహలు పూర్తిగా పోతాయి. నెగెటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్లిపోతుంది. అంతేకాదు… మీ జీవితం పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుది. ఇది కాకుండా, వెల్లుల్లి రసాన్ని తీసుకోవడం వల్ల మీకు ఏవైనా కడుపు నొప్పి సమస్యలు ఉంటే దూరమవుతాయి. వెల్లుల్లి రసాన్ని గ్రైండ్ చేసి, కొద్దిగా గోరువెచ్చని పాలు, తేనెతో కలిపి తీసుకోండి. మీరు నిద్రపోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు వెల్లుల్లిని కూడా ప్రయత్నించవచ్చు. ఇక సిరలు, ధమనుల సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి వాడితే… చక్కటి ఫలితం ఉంటుంది. గుండె సమస్యలు, లివర్ అనారోగ్యాలు ఉన్నవారికి వెల్లుల్లి సరైన మందులా పనిచేస్తుంది. వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ధమనుల్ని క్లీన్‌గా ఉంచుతుంది. ఓ వెల్లుల్లి రెబ్బను పచ్చడి చేసి… దాన్నీ, కొద్దిగా తేనెనూ.. ఓ గ్లాస్ పాలలో వెయ్యండి. ఆ పాలు తాగండి. వెల్లుల్లి యాంటీబయోటిక్‌లా పనిచేస్తుంది. ఇక బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే.. రోజూ ఉదయం పరగడుపునే ఓ వెల్లుల్లి రెబ్బను నమిలి తినాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..