Curry Leaves Benefits: ఉదయం నిద్రలేచిన వెంటనే కరివేపాకుతో ఇలా చేయండి.. రోగాలన్నీ పరార్..

చాలామంది కరివేపాకులను కూరల్లో వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కరివేపాకును వేయడం వల్ల కూర రుచి మరింత పెరుగుతుంది. అయితే, కరివేపాకు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని మీకు తెలుసా.

Curry Leaves Benefits: ఉదయం నిద్రలేచిన వెంటనే కరివేపాకుతో ఇలా చేయండి.. రోగాలన్నీ పరార్..
Curry Leaves
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 08, 2022 | 8:00 PM

చాలామంది కరివేపాకులను కూరల్లో వేయడానికి మాత్రమే ఉపయోగిస్తారు. కరివేపాకును వేయడం వల్ల కూర రుచి మరింత పెరుగుతుంది. అయితే, కరివేపాకు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా దివ్యౌషధంగా పనిచేస్తుందని మీకు తెలుసా. అవును కరివేపాకులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, సి, ఐరన్ కూడా పుష్కలంగా ఉంటాయి. కరివేపాకు ఆరోగ్యానికి ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. దీని వాడకం వల్ల చాలా రోగాలు శరీరాన్ని దరిచేరకుండా ఉంటాయి. ఈ ఆకును తీపి వేప అని కూడా అంటారు. కరివేపాకు మన ఆరోగ్యానికి ఎన్నివిధాలుగా మేలు చేస్తుందో ఇవాళ మనం తెలుసుకుందాం..

కరివేపాకు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది..

కరోనా ఎఫెక్ట్ కారణంగా.. ప్రజలు తమ రోగనిరోధక శక్తి పెంచుకోవడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కువగా మందులు తీసుకోవడం కంటే.. నేచురల్ ఆహారంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కరివేపాకులో విటమిన్లు ఎ, బి, సి తో పాటు.. ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన తరువాత ఖాళీ కడుపుతో కరివేపాకును తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రుచి నచ్చకపోతే.. తులసి ఆకులు, తేనెతో కలిపి తినవచ్చు. నాలుగు, ఐదు కరివేపాకులను, నాలుగు తులసి ఆకులను మెత్తగా రుబ్బుకుని అందులో కొంత తేనె కలిపి పేస్ట్ చేయాలి. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఈ పేస్ట్‌ను తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

కాలేయం ఆరోగ్యాన్ని పెంచుతుంది..

కరివేపాకు తినడం వలన కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కాలేయం చాలా కీలకమైనది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే ఏపని అయినా చేయగలుగుతాం. లేదంటే.. చాలా సమస్యలు వస్తాయి. కరివేపాకు కాలేయానికి చాలా మేలు చేస్తుంది. ఇది వైరల్ ఇన్ఫె్క్షన్లు, బ్యాక్టీరియా నుంచి కాలేయాన్ని కాపాడుతుంది. కరివేపాకులో ఉండే విటమిన్ ఏ.. కంటి చూపును మెరుగుపరుస్తుంది. అందుకే రోజూ కొన్ని కరివేపాకు ఆకులను తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..