PM Kisan Samman Nidhi Yojana: రైతులకు అలర్ట్.. వెంటనే ఇది పూర్తి చేయండి.. లేదంటే 13వ విడత నిధులు రావు..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Dec 07, 2022 | 1:23 PM

ఆర్థికంగా బలహీనంగా ఉండి, వ్యవసాయం సాగు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ, అప్పుల్లో కూరుకుపోతూ..

PM Kisan Samman Nidhi Yojana: రైతులకు అలర్ట్.. వెంటనే ఇది పూర్తి చేయండి.. లేదంటే 13వ విడత నిధులు రావు..
లేదా.. PM కిసాన్ యోజన- 155261 లేదా 1800115526 (టోల్ ఫ్రీ) లేదా 011-23381092 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చు. ఇక్కడ కూడా రైతుల ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
Follow us

ఆర్థికంగా బలహీనంగా ఉండి, వ్యవసాయం సాగు చేయడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు దేశంలో ఎంతో మంది ఉన్నారు. ఈ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ, అప్పుల్లో కూరుకుపోతూ ఎంతోమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు బాసటగా నిలుస్తూ.. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు ఏడాది రూ. 6 వేలు చొప్పున.. మూడు వాయిదాల్లో నగదు బదిలీ చేస్తోంది.

ఇప్పటి వరకు 12 వాయిదాలు చెల్లించిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు 13వ విడత డబ్బులు విడుదలకు ఏర్పాట్లు చేస్తోంది. 13వ విడత డబ్బు కోసం దేశ వ్యాప్తంగా అర్హత కలిగిన రైతులు ఎదరుచూస్తున్నారు. అయితే, రైతులు చేసే కొన్ని పొరపాట్ల కారణంగా ఆ డబ్బు అకౌంట్‌లో పడకుండా నిలిచిపోయే ప్రమాదం ఉంది. మరి అలా జరగకుండా ఉండాలంటే రైతులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

13వ విడత నిధులు ఎప్పుడు రావొచ్చు..?

12వ విడత పీఎం కిసాన్ నిధులు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పుడు 13వ విడత నిధులు రానున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. డిసెంబర్ చివరి నాటికి అంటే ఈ నెలలోపు రైతుల ఖాతాల్లో 13వ విడతకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు జమ కానున్నాయి.

ఇవి కూడా చదవండి

వీరికి 13వ విడత డబ్బులు పడకపోవచ్చు..

1. భూమి ధృవీకరణ చేయని రైతులకు 13వ విడత వాయిదా డబ్బులు అందవు. అర్హత కలిగిన ప్రతి రైతు తమ భూములను ప్రభుత్వం చే ధృవీకరించుకోవాలి. తద్వారా ప్రభుత్వం నుంచి నేరుగా డబ్బులు వారి ఖాతాలో జమ అవుతాయి. అందుకే రైతులు ముందుగా ఈ పనిని పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. లేదంటే వాయిదా డబ్బులు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు.

2. పీఎం కిసాన్ యోజనకు అర్హులైన రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి. లేదంటే పథకానికి సంబంధించి డబ్బులను పొందలేరు. ప్రతి లబ్దిదారుడు ఇది చేసుకోవాల్సిందే. ఒకవేళ ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే వెంటనే చేసుకోవాలి. లేదంటే డబ్బులు జమ అవ్వవు.

3. ఈ-కేవైసీని చేయడం ఎలాగో తెలియకపోతే.. సమీపంలోని సీఎస్‌సీ కేంద్రానికి వెళ్లి పూర్తి చేసుకోవచ్చు. అలా కాకుండా, పీఎం కిసాన్ పోర్టల్ pmkisan.gov.in కి వెళ్లాలి. అందులోని సూచించిన విధంగా ఈ-కేవైసీని స్వయంగా పూర్తి చేసుకోవచ్చు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Click on your DTH Provider to Add TV9 Telugu