BaalAadhaar: ‘బాల ఆధార్ కార్డ్’ కోసం డబ్బులు అడుగుతున్నారా? ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వారిపని అంతే ఇక..

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) దేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక ‘బాల్ ఆధార్’ను జారీ చేస్తుంది. దీనినే ‘బ్లూ ఆధార్ కార్డ్’ అని కూడా అంటారు.

BaalAadhaar: ‘బాల ఆధార్ కార్డ్’ కోసం డబ్బులు అడుగుతున్నారా? ఇక్కడ కంప్లైంట్ ఇస్తే వారిపని అంతే ఇక..
Baal Aadhaar Card
Follow us

|

Updated on: Dec 07, 2022 | 1:58 PM

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) దేశంలో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక ‘బాల్ ఆధార్’ను జారీ చేస్తుంది. దీనినే ‘బ్లూ ఆధార్ కార్డ్’ అని కూడా అంటారు. వాస్తవానికి పిల్లల ఆధార్ కార్డు కోసం రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, చాలా మంది మోసపూరితంగా డబ్బు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై దేశ వ్యాప్తంగా కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. దాంతో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న యూఐడీఏఐ.. డబ్బు వసూలు చేసే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అదే సమయంలో డబ్బులు వసూలు చేసే వారిపై ఎలా ఫిర్యాదు చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అనే అంశాలను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాల మనం తెలుసుకుందాం..

‘బాల్ ఆధార్’ పూర్తిగా ఉచితం..

5 సంవత్సరాల లోపు పిల్లలకు తీసుకునే బాల్ ఆధార్ కార్డ్ పూర్తిగా ఉచితం. UIDAI ఇందుకోసం ఎలాంటి రుసుము వసూలు చేయడం లేదు. అంతేకాదు.. పిల్లల బేస్‌లో బయోమెట్రిక్ గుర్తింపు మార్కులను అప్‌డేట్ చేయడం కూడా పూర్తిగా ఉచితం. అయితే, బాల్ ఆధార్ సమయంలో కొన్ని సేవా సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్నాయి. అది తీవ్ర నేరంగా పరిగణిస్తోంది UIDAI. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే ఫిర్యాదు ఇవ్వాలని, వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తింది UIDAI.

ఇవి కూడా చదవండి

ఎలా ఫిర్యాదు చేయాలి..

బాల్ ఆధార్‌కు సంబంధించి ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే.. వెంటనే 1947 నంబర్‌కు కల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా help@uidai.gov.in ఈ -మెయిల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇలా ఫిర్యాదు చేసిన వెంటనే సదరు సంస్థపై చర్యలు తీసుకుంటుంది UIDAI.

బాల్ ఆధార్ ఇలా పొందవచ్చు..

మీరు కూడా మీ పిల్లల బాల్ ఆధార్ కార్డ్ తీసుకోవాలనుకుంటే.. ఈ క్రింది ప్రక్రియను ఫాలో అవ్వొచ్చు.

1. ముందుగా మీరు UIDAI uidai.gov.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.

2. ఆ తర్వాత ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఎంపికపై క్లిక్ చేయాలి.

3. ఆపై మీ పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్.. బిడ్డ, అతని తల్లిదండ్రులకు సంబంధించిన ఇతర అవసరమైన బయోమెట్రిక్ సమాచారం, అవసరమైన వివరాలను పూరించాలి.

4. దీని తర్వాత మీరు తప్పనిసరిగా నివాస చిరునామా, రాష్ట్రం మరియు ఇతర వివరాలను పూరించాలి.

5. నమోదు చేసిన అన్ని వివరాలను సరి చూసుకుని, సబ్మిట్ క్లిక్ చేయాలి.

6. ఆ తరువాత అపాయింట్‌మెంట్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

7. వినియోగదారుల గురింపు, చిరునామా, పుట్టిన తేదీ, వంటి అవసరమైన దృవీకరణ పత్రాలను ఆధార్ ఎగ్జిక్యూటీవ్ వద్దకు తీసుకెళ్లాలి. వాటిని పరిశీలించి ఆధార్ ఎగ్జిక్యూటీవ్ తదుపరి ప్రాసెసింగ్‌ను పూర్తి చేస్తారు. దరఖాస్తు ప్రక్రియను ట్రాక్ చేయడానికి రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు.

8. ఆధార్ కార్డ్ 60 రోజుల లోపు వినియోగదారు నమోదిత చిరునామాకు పోస్టులో చేరుతుంది.

బాల్ ఆధార్‌కు సంబంధించిన వివరాలు ఇక్కడ చూడండి..

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!