Viral Video: వీళ్లు మాములు దొంగలు కాదు సుమీ.. కేవలం 60 సెకన్లలో రూ. 7 కోట్లు మాయం చేశారు..
Viral Video: దొంగతనం అనేది ఒక ఆర్ట్.. చేసే పని పక్కవాళ్లకు తెలియకూడదంటారు. ఇక దానికి వీళ్లు ఆర్టిస్టులు. సెకన్లలో కోట్లు కొల్లగొట్టారు. అందుకు సంబంధించిన వీడియో..
దొంగతనం అనేది ఒక ఆర్ట్.. చేసే పని పక్కవాళ్లకు తెలియకూడదంటారు. ఇక దానికి వీళ్లు ఆర్టిస్టులు. సెకన్లలో కోట్లు కొల్లగొట్టారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. అది చూశాక ఇంత సులభంగా కొట్టేయచ్చా అని మీరు నోరెళ్ళబెట్టడం ఖాయం. ఈ హైటెక్ దోపిడీ ఇంగ్లాండ్‌లో చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే..
కొద్దిరోజుల కిందట ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్ కౌంటీ బ్రెంట్‌వుడ్ రోడ్ సమీపంలోని ఓ ఇండస్ట్రియల్ యూనిట్‌లో కొందరు దొంగలు చొరబడ్డారు. అక్కడ ఉన్న ఐదు లగ్జరీ కార్లను చాకచక్యంగా చాలా ఈజీగా ఎత్తుకెళ్ళారు. వచ్చిన వ్యక్తుల్లో ఒకరు గేటు ఓపెన్ చేయగా.. మిగిలినవాళ్లు ఎంచక్కా ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ కేవలం 60 సెకన్లలోనే అక్కడ నుంచి బయటపడ్డారు. కాగా, ఆ దొంగలు ఎత్తుకెళ్ళిన లగ్జరీ కార్ల విలువ సుమారు రూ. 7 కోట్లు ఉంటుందని అంచనా. వాటిల్లో రెండు పోర్ష్, మెర్సిడెస్.. అలాగే ఒక మేబ్యాక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు ఈ దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం