Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: బిజినెస్‌ మీటింగ్‌కు హాజరైన అనుకోని అతిథి..! హ్యాపీగా కేక్‌ తింటూ ఎలా ఎంజాయ్‌ చేస్తోందో చూడండి..!

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు ఉద్యోగులు ఏదో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సీరియస్‌గా ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు. వీడియో ప్రారంభంలోనే ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి.

Viral Video: బిజినెస్‌ మీటింగ్‌కు హాజరైన అనుకోని అతిథి..! హ్యాపీగా కేక్‌ తింటూ ఎలా ఎంజాయ్‌ చేస్తోందో చూడండి..!
Rat Attends Meeting
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 07, 2022 | 1:35 PM

సోషల్ మీడియాలో ప్రతి నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలు ముఖ్యంగా పాములు, పులులు, సింహాలు, ఏనుగులకు సంబంధించి ఎక్కువగా వైరల్‌ అవుతుంటాయి. ఇంకా చిన్న చిన్న చిట్టెలుకలు, పిచ్చుకలు, కోళ్లు, కొంగలు, కప్పలు, కుక్కలు, కోతులకు సంబంధించిన అల్లరి చిల్లర చిలిపి చేష్టలకు సంబంధించిన వీడియోలు కూడా నెటిజన్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. జంతువులు, పక్షులు చేసే అల్లరిని నెటిజన్లు ఎంతగానో ఇష్టపడుతుంటారు. వాటిని చూసి తమలోని ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం కూడా చేస్తుంటారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలకు కొదువే ఉండదు. అయితే, ఇక్కడ కూడా అలాంటిదే ఓ ఫన్నీ వీడియో వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇంతకీ వైరల్‌ వీడియోలో ఏం జరిగిందంటే…

వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొందరు ఉద్యోగులు ఏదో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అందరూ సీరియస్‌గా ఏదో అంశంపై చర్చించుకుంటున్నారు. వీడియో ప్రారంభంలోనే ఈ సమావేశానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి. ఈ క్రమంలోనే కెమెరాను జూమ్ చేసినప్పుడు..వీరి సమావేశానికి అనుకోని అతిథి ఒకరు హాజరైనట్టుగా తెలిసింది. మీటింగ్‌ మెయిన్‌ చైర్‌లో కూర్చుని ఉన్న ఓ వ్యక్తి ముందర పుష్ప గుచ్చం పెట్టి ఉంది. ఆ పక్కనే ప్లేట్‌లో ఒక కేక్‌ ముక్క కూడా..అక్కడే నక్కి ఉంది ఆ అనుకోని అతిథి..ఇంతకీ ఎవరంటే ఒక చిన్న ఎలుక..ఎవరూ పిలవకుండానే చర్చకు హాజరైంది. అక్కడి ఉద్యోగుల సమావేశం కోసం వేసిన టేబుల్‌పై ఉంచిన కేక్ ముక్కను మింగేస్తూ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉద్యోగులంతా సీరియస్‌గా మాట్లాడుకుంటున్న సందర్భంలో పూల మాటున దాక్కున్న ఎలుక మాత్రం హ్యాపీగా కేక్‌ లాంగించేస్తూ ఎంజాయ్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి