Viral video: ప్రపంచాన్ని కలవరపరిచిన వింత జంతువు ఏంటో తెలుసా ..? నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న నక్కా ! కాదు కాదు.. తోడేలు..?

విచిత్రం ఏంటంటే.. ఆ జంతువు మొదట చూస్తే తోడేలులా కనిపించినా.. నిశితంగా పరిశీలిస్తే అది నక్కలా కనిపిస్తుంది.. ఇది ఏ వర్గానికి చెందినదో ఇప్పటికీ తెలియదు. ఈ అసాధారణ జంతువు రోడ్డు దాటుతుండగా అనుకోకుండా అక్కడి స్థానికుల కెమెరాకు చిక్కింది.

Viral video: ప్రపంచాన్ని కలవరపరిచిన వింత జంతువు ఏంటో తెలుసా ..? నెట్టింట హల్‌చల్‌ చేస్తున్న నక్కా ! కాదు కాదు.. తోడేలు..?
Maned Wolf
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 07, 2022 | 12:35 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ వింత జంతువు కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అది చూసేందుకు నక్క, తోడేలుకు దగ్గరి రూపంతో విచిత్రంగా కనిపిస్తోంది. ఈ విచిత్ర ఆకారంతో ఉన్న వింతైన ఈ జంతువు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మేన్డ్ వోల్ఫ్ వీడియో వైరల్‌గా మారింది. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇంటర్నెట్ యూజర్ రెగ్ సాడ్లర్ ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో ఒక జంతువు ప్రశాంతంగా రోడ్డు దాటుతున్నట్లు చూడవచ్చు. విచిత్రం ఏంటంటే.. ఆ జంతువు మొదట చూస్తే తోడేలులా కనిపించినా.. నిశితంగా పరిశీలిస్తే అది నక్కలా కనిపిస్తుంది.. ఇది ఏ వర్గానికి చెందినదో ఇప్పటికీ తెలియదు. ఈ అసాధారణ జంతువు దక్షిణ అమెరికాలో రోడ్డు దాటుతుండగా అనుకోకుండా అక్కడి స్థానికుల కెమెరాకు చిక్కింది. ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన వ్యక్తి.. ‘ఇది ఏంటో ఎవరికైనా తెలుసా?! అని ప్రశ్నిస్తూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు.

ఈ పోస్ట్‌ను ఇప్పటికే రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. ఇలాంటి జంతువును చూసి చాలా మంది ట్విటర్ యూజర్లు షాకవుతున్నారు. ఇది హైనా అని కొందరు అనుకుంటే, మరికొందరు వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. వీడియో చూసిన ఇంకొందరు తోడేలు అని, మరికొందరు అది నక్క జాతి అయి ఉండవచ్చని అంటున్నారు. మరికొందరు అది పొడవాటి ఎర్రటి-గోధుమ రంగు బొచ్చు, చాలా పొడవాటి నల్లటి కాళ్లు, నక్క లాంటి తలతో ఉన్న మేనేడ్ తోడేలు కావచ్చునని అంటున్నారు. ఇది రాత్రిపూట మాత్రమే తిరిగే జీవిగా చెబుతున్నారు. అలాగే, ఇది చిన్న జంతువులు, కీటకాలు, మొక్కల వంటివి తినే ఒంటరి జంతువు మేన్డ్‌ వోల్ఫ్‌ అని చెబుతారు.

ఇవి కూడా చదవండి

ఒక వినియోగదారు కామెంట్‌ చేస్తూ..ఇది ఫేక్ వీడియో అంటున్నారు. ఎందుకంటే మెడపై నల్లటి బొచ్చు ఒకసారి కనిపిస్తుంది. తర్వాత మళ్లీ అదృశ్యమవుతుందని కామెంట్‌ చేశారు. మరొక వినియోగదారు ఇది ఫాక్స్ హైబ్రిడ్ జాతి కావచ్చు.. బహుశా అది హైనా లేదా కొయెట్ లాగా ఉండవచ్చు అంటూ ట్విట్‌ చేశారు.

ఈ వీడియోను ట్విట్టర్ పేజీ ఫెసినేటింగ్ రీట్వీట్ చేసింది. అక్కడ ఈ జంతువును ‘మేన్డ్ వోల్ఫ్’ అని పిలుస్తారు. బ్రిటానికా ప్రకారం, ఈ జాతి మధ్య దక్షిణ అమెరికాలోని మారుమూల మైదానాలలో కనిపిస్తుంది. అలాగే, ఈ జంతువు కుక్క కుటుంబానికి చెందిన అరుదైన పెద్ద చెవుల జంతువు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
'మీరు మాత్రం క్షమించకండి సార్'.. పోసాని క్షమాపణలపై నిర్మాత ట్వీట్
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
అంబానీ కారు డ్రైవర్​ జీతం ఎంతో తెలుసా ?? అసలు కథ ఇది !!
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
ఇండియాలోనే ఉన్నానా ?? నమ్మలేకపోయిన జపాన్ టూరిస్ట్
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
బంగారంతో పాటు ఇతర ఖనిజాలను.. ఎలా వెలికితీస్తారో తెలుసా ??
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!
ఒమేగా 3 కోసం చేపలే తినక్కరలేదు.. శాఖాహారంలో వీటిని ట్రై చేయండి !!