Viral: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం.. చేయకూడని తప్పు చేసి లబోదిబోమంటున్న మహిళ..

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే మరి.. ఓ మోడల్‌ను చూసి తానూ అలా కనిపించాలన్న తాపత్రయంతో చేసిన ప్రయోగం వికటించింది ఓ మహిళ కంటి చూపును కోల్పోయే పరిస్థితి వచ్చింది.

Viral: చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏ ప్రయోజనం.. చేయకూడని తప్పు చేసి లబోదిబోమంటున్న మహిళ..
Women Tattoo Viral
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 07, 2022 | 11:59 AM

పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే మరి.. ఓ మోడల్‌ను చూసి తానూ అలా కనిపించాలన్న తాపత్రయంతో చేసిన ప్రయోగం వికటించింది ఓ మహిళ కంటి చూపును కోల్పోయే పరిస్థితి వచ్చింది. వయసులో చిన్న అయినా, విషయ పరిజ్ఞానంతో అమ్మా వద్దు అని తన కూతురు ఎంత వారించినా వినకుండా ప్రయోగాలు చేసి ఇప్పుడు అవస్థలు పడుతోంది. తప్పు చేశానంటూ ఇప్పుడు బాధపడుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియన్ మోడల్ అంబర్ లక్ తన కళ్లకు నీలి రంగు టాటూ వేయించుకుని డిపరెంట్‌ లుక్‌లో కనిపించింది. అయితే, ఆ లుక్‌ చూసి ఇన్‌స్పైర్ అయిన నార్త్ ఐర్లాండ్‌కు చెందిన అనయా పీటర్సన్(32).. తన కనుగుడ్లపై బ్లూ, పర్పుల్ రంగులతో పచ్చబొట్టు వేయించుకుంది. అయితే, ఆమె ఏడేళ్ల కూతురు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించింది. కంటి చూపు పోయే ప్రమాదం ఉందంటూ సీరియస్ వార్నింగే ఇచ్చింది. కానీ, అది పెడచెవిన పెట్టిన అనయా.. టాటూ వేయించుకున్నారు. మొదట బాగానే ఉన్నా.. ఆ తరువాత రియాక్షన్ మొదలయ్యాయి. కనుగుడ్ల వాయడంతో కళ్లు పూర్తిగా మూసుకుపోయాయి. దాంతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఆమె కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాగా, అనయా టాటూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. చిన్న పాప చెప్పినా వినకుండా పిచ్చి పనులు చేసి.. ఇప్పుడు ఇబ్బందులు పడటం అవసరమా? అంటూ కాస్త గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం అంటే ఇదే మరి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న అనయా పీటర్సన్ టాటూ వీడియో..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!