Jungle Safari Viral Video: అడవిలో దర్శనమిచ్చిన ‘కుంతి’.. పాండవులతో కలిసి ప్రయాణిస్తుండగా తీసిన వీడియో వైరల్..!
మరో వినియోగదారు వీడియో చూసి ధన్యవాదాలు తెలిపారు. ఇది అందమైన వీడియో అంటూ ట్విట్ చేశారు. ఇలా ఇప్పటి వరకు వీడియోని వేల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. భిన్నమైన కామెంట్లు చేశారు.
అడవిలో సఫారీ రైడ్‌కి వెళ్లినప్పుడు అక్కడి జంతువులను చూడటం ఒక థ్రిల్లింగ్ అనుభవం. మీరు కూడా అడవిలో సఫారీకి వెళ్లినప్పుడు అకస్మాత్తుగా క్రూర జంతువుల సమూహాన్ని చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది..? కానీ, సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి వీడియోలకు కొదువే లేదు. ఫారెస్ట్ సఫారీ రైడ్‌కి వెళ్లే పర్యాటకులు తమ అనుభవాలను తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దాంతో అవి నెట్టింట వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టూరిస్ట్ వీడియో జనాన్ని విస్మయానికి గురి చేసింది. జంగిల్ సఫారీలో ఒకే చోట ఒక్క పులి మాత్రమే కాదు.. ఐదు పిల్లలు కూడా కనిపించాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియోలో సఫారీ టూరిస్ట్‌లకు రోడ్డు దాటుతున్న ఓ పులి దాని ఫ్యామిలీతో కలిసి కనిపించింది. పులి వెనుక వస్తున్న పిల్లలను చూసి పర్యాటకులు కేకలు వేయడం ప్రారంభించారు. ఆ పులి తన ఐదు పిల్లలతో రోడ్డు దాటుతుండగా పర్యాటకుడు వాటి ముందు జంగిల్ సఫారీ కోసం అరవడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో పర్యాటకులు ఉత్సాహంగా మాట్లాడుకోవడం వినబడుతుంది. ఒక స్త్రీ కూర్చోమని ఆజ్ఞాపించడం వినబడుతుంది.
అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చారు. కుంతి ఐదుగురు పాండవులతో దర్శనం ఇచ్చింది. ఒక లేడీ ఎవరినైనా కూర్చోమని ఆజ్ఞాపించగలదు అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చారు. ఆ అధికారి తన పాండవులతో (పిల్లలతో) అడవిలో తిరుగుతున్న పులికి కుంతీ అని పేరు పెట్టాడని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాగా, ఈ వీడియోని ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా రీ ట్విట్ చేశారు.
Kunti gave a darshan with panchu Pandavas.. I don’t know whom the lady was commanding to sit down in the loud voice ?? pic.twitter.com/kwkUEILJCZ
— Susanta Nanda IFS (@susantananda3) December 4, 2022
ఇక వీడియో చూసిన వినియోగదారు ఒకరు పులిని చూసి సంతోషం వ్యక్తం చేశారు. ఇది అద్భుతంగా ఉంది సార్ అంటూ కామెంట్ చేశారు.. ఇది ఏ ప్రాంతానికి చెందిన టైగర్ రిజర్వ్డ్ ఫారెస్ట్ సర్ అంటూ ప్రశ్నించారు. మరో వినియోగదారు వీడియో చూసి ధన్యవాదాలు తెలిపారు. ఇది అందమైన వీడియో అంటూ ట్విట్ చేశారు. ఇలా ఇప్పటి వరకు వీడియోని వేల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు. భిన్నమైన కామెంట్లు చేశారు. ఇకపోతే, సుశాంత్ నందా తన ట్విట్టర్ పేజీలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలను ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి