Trending News: మెట్రో రైల్లో పడిపోయిన టిఫిన్ బాక్స్.. నోట్ బుక్ చింపి, కర్చీఫ్‌తో శుభ్రం చేసిన యువకుడు..
ఢిల్లీలో మెట్రో ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్న బాలుడు లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అతను ఎందుకు అలా శుభ్రం చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే..
ఇంట్లో నేలపై ఏదైనా పడిపోతే వెంటనే మనం దాన్ని శుభ్రం చేస్తాం. అదే హోటల్‌లో అయితే, క్లీనర్లు ఉంటారు. రోడ్డు మీద సివిల్ సర్వెంట్లు ఉంటారు. అయితే కదులుతున్న మెట్రోలో పొరపాటున ఏదైనా కిందపడిపోతే పరిస్థితి ఎంటీ..? దాన్ని క్లీన్ చేస్తారు.. ఇలాంటి సందేహం మీకు ఎప్పుడైనా వచ్చింది. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో మెట్రో రైలు లోపల జరిగిన సంఘటన. ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణిస్తున్న ఒక బాలుడు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు. ఢిల్లీలో మెట్రో ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్న బాలుడు లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్ట్ ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అతను ఎందుకు అలా శుభ్రం చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పారబోసింది అతడే కాబట్టి. వీడియోకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ పోస్ట్‌ను అషు సింగ్ లింక్డ్‌ఇన్‌లో షేర్ చేశారు. బాలుడు తన బ్యాగులోంచి వాటర్ బాటిల్ తీస్తుండగా ప్రమాదవశాత్తు లంచ్ బాక్స్ పడిపోయింది. అప్పుడు అతను తన నోట్ బుక్ షీట్ ఉపయోగించి పడిపోయిన ఆహారాన్ని శుభ్రం చేశాడు. తర్వాత తన కర్చీఫ్‌తో నేలను తుడిచి పూర్తిగా శుభ్రం చేశాడు.
ఇప్పటివరకు ఈ పోస్ట్‌ను లక్ష మంది లైక్ చేశారు. వందలాది మంది స్పందించారు. మంచి విద్యకు ఇది నిజమైన ఉదాహరణ అని చాలా మంది కామెంట్ చేశారు. ఇలాంటి బాధ్యతాయుతమైన యువత చేసే పనులు మాత్రమే మన దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్మిస్తాయని మరికొందరు అంటున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా అడుగులు వేస్తే దేశం పరిశుభ్రంగా, అందంగా ఉంటుందని పలువురు పేర్కొన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం క్లిక్ చేయండి