Bike Stunt: అమ్మాయి ముందు హీరో అవుదామనుకున్నాడు.. కానీ ఎం చేస్తే పరువు పాయె.. వీడియో.
ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్, నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చిన తర్వాత.. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా నెట్టింట్లో ప్రత్యక్షం అవుతుంది. ప్రతిరోజూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కొన్ని వీడియోలు కొందరి నెటిజన్లకు గుణపాఠం లాంటివని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఇందులో ఒక అబ్బాయి తన ప్రియురాలిని బైక్‌పై ఎక్కించుకుని.. వేగంగా దూసుకుపోతూ తన హీరోయిజాన్ని చూపించాలనుకున్నాడు. కానీ తన ప్లాన్ బెడిసికొట్టడంతో అమ్మాయి ముందు జీరోగా మిగిలాడు. వైరల్ అవుతున్న వీడియోలో.. హైవేపై బైకర్ల బృందం తమ బైక్‌లను అతి వేగంతో నడుపుతున్నారు. ఈ సమయంలో.. తన ప్రియురాలిని బైక్ వెనుక కూర్చోబెట్టుకుని వెళ్తున్న ఒక యువకుడు హఠాత్తుగా తన బైక్ రైడింగ్‌తో స్టంట్ చేయాలనుకున్నాడు. అయితే బైక్ స్టైల్ గా నడపడానికి ట్రై చేసి.. బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దీంతో ఆ అబ్బాయి, అమ్మాయి రోడ్డుపై పడిపోయారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాబ్రేజ్ 228 అనే ఖాతాతో షేర్ చేసారు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అమ్మాయి ముందు హీరో అవడానికి ఇలాంటి స్టంట్స్ చేయాల్సిన అవసరం లేదంటున్నారు. అది ప్రమాదాలు కొనితెచ్చుకోవడమే అంటూ కామెంట్లతో యువతకు హితవు పలుకుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..