Snake Vs Monkey: కోతి బావ ఎం చేసిన ఇంతే.! నవ్వు ఆపుకోలేం.. నల్ల తాచుతో నాట్యం చేయించిన కోతి..
కోతి చేసే అల్లరి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే.. మనుషులు ఎవరైనా అల్లరి చేస్తే ఏంట్రా ఆ కోతి పనులు అని చివాట్లు పెడుతుంటారు. అయితే, తాజాగా ఓ కొతి చేసిన ప్రమదాకరమైన అల్లరి పనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి ఏకంగా నల్లత్రాచునే ఓ ఆటాడుకుంది. దానిని తెగ విసిగించింది. అటవీ ప్రాంతంలో 10 అడుగుల పొడవున్న ఓ నల్లత్రాచు వెళుతండగా.. కోతి గమనించింది. దాని వెంట పడింది. తన దారిన తాను వెళ్తున్న పామును.. ఆ కోతి అడ్డుకుంది. తోక పట్టుకుని లాగుతూ నానా హంగామా చేసింది. ఆ నల్లత్రాచును చూస్తే వణుకుపుడుతుంది. అది బుసలు కొడుతూ కోతిపై ఎటాక్ చేయడానికి ప్రయత్నించింది. అయినా ఆ కోతి ఏమాత్రం భయపడటం లేదు సరికదా.. ఇంకాస్త ఎక్కువగా విసిగించడం మొదలు పెట్టింది. ఒక రకంగా చెప్పాలంటే పాముతో కాసేపు డాన్స్ ఆడించేసింది. ఇలా కాసేపు పోట్లాడుకుని, ఆ తరువాత తమ దారి తాము చూసుకున్నాయి కోతి, పాము. కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. ఆ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంత ప్రమాదకరమైన పాముతో కోతి చెలగాటమాడటం చూసి ఆశ్చర్యపోయారు. ఓవైపు కామెడీగా ఉన్నా.. పాము కాటేస్తే ఆ కోతి ప్రాణాలు గాల్లో కలిసేవి అని నెటిజన్లు అంటున్నారు. అయితే, ఇదంతా వీడియో తీసిన వ్యక్తిపైనా నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

