Young man – father: యువకుడి తొందరపాటుకి.. పాపం తండ్రి బలి.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
కొడుకు తొందరపాటుకు తండ్రి బలయ్యాడు. ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకుకు వచ్చాడు. అతనితో పాటు బైక్‌పై వెనుక సీట్లో అతని తండ్రి కూడా కూర్చున్నాడు.
కొడుకు తొందరపాటుకు తండ్రి బలయ్యాడు. ఓ వ్యక్తి తన బైక్‌లో పెట్రోల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంకుకు వచ్చాడు. అతనితో పాటు బైక్‌పై వెనుక సీట్లో అతని తండ్రి కూడా కూర్చున్నాడు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకు వద్ద కొద్దిపాటి రద్దీ ఉండడంతో అందరూ క్యూలో వెళ్తున్నారు. కానీ ఈ వ్యక్తి మాత్రం కాస్త తొందరగా వెళ్లాలనే ఉద్దేశంతో ఫాస్ట్‌గా బైక్‌ని ముందుకు పోనిచ్చాడు. ఈ క్రమంలోనే బైక్ అదుపుతప్పి ముందు చక్రం ఒక్కసారిగా పైకి లేచింది. దాంతో బైక్‌మీద వెనుక కూర్చున్న అతని తండ్రి కిందపడిపోయాడు. అంతేకాదు పక్కనే పార్క్ చేసిన మరో బైక్‌ను ఢీ కొట్టడంతో అతడు కూడా కిందపడిపోయాడు. బైక్ పైకి లేవటంతో ఆ యువకుడి తండ్రి ఒక్కసారిగా కిందపడిపోవడంతో అతడి వెన్నులో తీవ్రమైన గాయం అయినట్లు తెలుస్తోంది. కొడుకు చేసిన తప్పుకు తండ్రిని శిక్షించినట్లే అయింది. ఈ వీడియో చూసిన పలువురు తండ్రి పరిస్థితి చూసి విచారం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఆ వ్యక్తి తొందరపాటు ప్రవర్తనకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్లు రీట్వీట్ చేస్తూ తమదైనశైలిలో కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Ghost in hospital: అర్ధరాత్రి ఆస్పత్రికి వచ్చిన దెయ్యం.. సీసీ కెమెరాలో నమ్మలేని నిజాలు.. వీడియో.
వామ్మో అంత రేటా..? కేజీ రూ. 83కి చేరిన సన్నబియ్యం..
ఇక మగాళ్లకూ ఫ్రీ బస్సే! రవాణా మంత్రి సంచలన ప్రకటన
కబోర్డ్ ఓపెన్ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్ చూసి హడల్
అర్ధరాత్రి ఉన్నట్టుండి ఇళ్లపై రాళ్ల వర్షం..
భారతీయ భార్యపై అమెరికన్ భర్త ప్రశంసల వర్షం..
చంపాక ఎలా ఏడవాలి అని చాట్‌జీపీటీని అడిగిన ప్రియురాలు
జింక కోసం మాటువేసిన పులి.. నెమలి ఎంట్రీతో..

