Man with street dogs: వీధి కుక్కలే నేస్తాలుగా పుట్‌పాత్‌పై నిద్రపోతున్న వ్యక్తి..! 24 క్యారెట్స్ గోల్డ్ అంటున్న నెటిజనం..
ఆకలికి రుచి తెలియదు.. నిద్రకు శుచి తెలియదంటారు. ఈ ఘటనచూస్తే అది అక్షరాలా నిజమనిస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై ఆదమరిచి నిద్రపోతున్నాడు.
ఆకలికి రుచి తెలియదు.. నిద్రకు శుచి తెలియదంటారు. ఈ ఘటనచూస్తే అది అక్షరాలా నిజమనిస్తుంది. ఇక్కడ ఓ వ్యక్తి ఫుట్‌పాత్‌పై ఆదమరిచి నిద్రపోతున్నాడు. అదికూడా వీధికుక్కలతో కలిసి. ఈ ఫోటోను ఐఎఫ్‌ఎప్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్‌ఖాతాలో షేర్ చేసారు. తల దాచుకునేందుకు ఇల్లు కూడా లేని ఆ వ్యక్తి ఫుట్‌పాత్‌పైనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. ఓ చిన్న మ్యాట్ వేసుకుని గొడుగు అడ్డు పెట్టుకుని ఫుట్‌పాత్‌పైన నిద్రపోతున్నాడు. అయితే అతనితోపాటు ఆ మ్యాట్‌పైన ఓ 8 వీధికుక్కలు కూడా పడుకుని ఉన్నాయి. ఈ వ్యక్తి మానవత్వానికి ఎవరైనా హ్యాట్సాఫ్ అనాల్సిందే. ఎందుకంటే తనకున్న ఆ కాస్త చోటులోనే మరో 8 మూగ జీవాలకు చోటిచ్చాడు. వాటినే తన నేస్తాలుగా భావించి ఆ వీధికుక్కలతో కలిసి ఆదమరచి నిద్రపోయాడు.ఈ ఫొటో షేర్ చేసిన సుశాంత్ నంద ‘ఇంత పెద్ద ప్రపంచంలో మన హృదయం కూడా తగినంత పెద్దదిగా ఉండాలి’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన నెటిజన్లు ‘అతను మనసు 24 క్యారెట్ల గోల్డ్..’, ‘మంచి ఆలోచన’, ‘మంచి మనసున్న వ్యక్తి’, అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్‌పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

