Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్ అదుర్స్..! కుక్కపై ప్రశంసలు.. వైరల్ అవుతున్న క్యూట్ వీడియో.
సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అవి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి. తాజాగా ఓ కుక్క .. పిల్లి పిల్లని
తాజాగా ఓ కుక్క .. పిల్లి పిల్లని కాపాడిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక పిల్లి పిల్ల ఒక నీటి ప్రవాహం మధ్యలో ఇరుక్కుపోయింది. అక్కడ ఓ బండరాయిపై నిలబడి బిక్కుబిక్కుమంటూ కనిపించింది. అంతలోనే అటుగా వచ్చిన ఒక కుక్క పిల్లిని చూసింది. ఎలాగైనా దాన్ని కాపాడాలనుకుంది. పిల్లిని కాపాడేందుకు ఆ కుక్క వేగంగా వెళ్లి ఓ చెక్కను నోట కరుచుకుని తీసుకొచ్చింది. నీటి ప్రవాహానికి అడ్డుగా వేసింది. పిల్లి కాళ్ల దగ్గర నుంచి ఆ చెక్కను వంతెనలా వేసింది. దాంతో ఆ పిల్లి చెక్కపై నుంచి చక్కగా నడుచుకుంటూ ఇవతలి ఒడ్డుకు చేరింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కుక్క చేసిన ఈ పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ కురిపిస్తున్నారు. కొందరు మాత్రం లైకుల కోసం కావాలనే ఇలాంటి వీడియోలు చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. లైకుల కోసం పిల్లిని ఇలా హింసించటం తప్పని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇలాంటి వీడియోలు చూడమని ప్రజలను ప్రోత్సహించవద్దంటున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

