Woman – daughter: అమానుషం.. తన ప్రియుడితో కుమార్తెకు పెళ్లి చేయించిన తల్లి..! బిడ్డను కాపాడుకోవాల్సిన తల్లే ఇలా..
నవమోసాలు మోసి కనిపెంచిన తల్లే కూతురి పట్ల దారుణంగా ప్రవర్తించింది. రాక్షసుల నుంచి బిడ్డను కాపాడుకోవాల్సిన తల్లే.. క్రూరమైన చర్యకు పాల్పడింది. తనతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తితో కూతురికి బలవంతంగా వివాహం జరిపించింది.
ఓ 38 ఏండ్ల మహిళ తన 15 ఏళ్ల మైనర్ కుమార్తెతో కలిసి పుణెలో ఉంటోంది. అయితే వివాహితకు 28 ఏండ్ల యువకుడితో ఏర్పడిన పరిచయం, అనైతిక సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో ఆ యువకుడి కన్ను ఆమె కూతురుపై పడింది. దీంతో ఆ యువకుడితో తన కూతురికి బలవంతంగా పెళ్లి చేసింది. అనంతరం అతనితో శృంగారం చేయాలని ఒత్తిడి చేసింది. చివరకు ఆ బాధను తట్టుకోలేక తన స్నేహితురాలికి ఆ బాలిక చెప్పింది. స్నేహితురాలి ద్వారా విషయం స్వచ్ఛంద సంస్థలకు చేరడంతో బాలికకు విముక్తి కలిగింది. దీంతో తల్లితో పాటు ఆ యువకుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 6వ తేదీన అహ్మద్‌నగర్‌లో బాలికకు వివాహం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
గుడి లేకుండా ధ్వజస్థంభం.. కాని నిరంతరం పూజలు.. ఎక్కడంటే ?
కురుపు అని గిల్లితే.. బయటపడిన బుల్లెట్
మగపిల్లవాడి కోసం ఆ దంపతులు ఏం చేశారో తెలుసా
భార్య వంట చేయడంలేదని కోర్టుకు ఎక్కిన భర్త..
దొంగ ఇంట్లో పోలీసులు చోరీ.. అదే కదా మ్యాజిక్కు
బట్టతల దాచిపెట్టి పెళ్లి.. బండారం బయటపడగానే.. బ్లాక్ మెయిల్
ఏడేళ్లుగా ఒంటికాలిపై సాధువు !! అన్న పానీయాలు, నిద్రా ఆ భంగిమలోనే

