AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flight Video: మిస్‌ అయిన సెల్‌ఫోన్‌.. విమానంలోంచి అందుకున్న పైలట్‌.. నెట్టింట వీడియో వైరల్..

ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు మనం సాధారణంగా బైక్ తాళాలో లేక సెల్ ఫోన్ మర్చిపోతుంటాం. చూసుకున్న వెంటనే మళ్లీ వెళ్లి తెచ్చుకుంటాం. ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది. హడావిడి, బిజీ లైఫ్ వల్ల...

Flight Video: మిస్‌ అయిన సెల్‌ఫోన్‌.. విమానంలోంచి అందుకున్న పైలట్‌.. నెట్టింట వీడియో వైరల్..
Mobile In Flight
Ganesh Mudavath
|

Updated on: Nov 18, 2022 | 7:13 AM

Share

ఇంట్లో నుంచి బయటకు వెళ్లినప్పుడు మనం సాధారణంగా బైక్ తాళాలో లేక సెల్ ఫోన్ మర్చిపోతుంటాం. చూసుకున్న వెంటనే మళ్లీ వెళ్లి తెచ్చుకుంటాం. ఇలా చాలా మందికి జరిగే ఉంటుంది. హడావిడి, బిజీ లైఫ్ వల్ల అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఇంట్లో మర్చిపోతే వెళ్లి తెచ్చుకోవచ్చు. కానీ విమానం ఎక్కిన తర్వాత మర్చిపోతే.. హా.. ఇక్కడ సరిగ్గా ఇలాంటిదే జరిగింది. ఫ్లై్ట్ లో ప్రయాణించాల్సిన ఓ వ్యక్తి.. తన ఫోన్ ను గేట్ వద్ద మర్చిపోయాడు. ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేశాడు. దాంతో వారు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానం టేకాఫ్‌ సమయం దగ్గర పడింది. ప్రయాణికులంతా హడావిడిగా విమానం ఎక్కేశారు. ఇక బయలుదేరుతుందనగా ఓ వ్యక్తి తన సెల్‌ ఫోన్‌ గేట్‌ వద్ద మర్చిపోయాడు. అది గమనించిన గ్రౌండ్‌ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ఫోన్‌ తీసుకొని టేకాఫ్‌ అవుతున్న విమానం దగ్గరకి పరుగెత్తారు.

విషయం గ్రహించిన పైలట్‌ టేకాఫ్‌ అయిన విమానం కిటికీలోంచి వంగి సిబ్బంది దగ్గరనుంచి ఆ ఫోన్‌ అందుకున్నాడు. అనంతరం ఆ ఫోన్‌ మర్చిపోయిన వ్యక్తికి అందించారు.ఈ ఘటన కాలిఫోర్నియాలోని లాంట్‌ బీజ్‌ ఎయిర్‌పోర్ట్‌లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియోని డల్లాస్‌ ఎయిర్‌లైన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ.. సౌత్‌వెస్ట్‌ ఎయిర్‌లైన్స్‌ని ప్రేమించండి. ఇలా మా సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులకు సాయం చేయడాన్ని కస్టమర్‌ సర్వీస్‌ రిప్రజెంటేటివ్‌ అంటారు అని పేర్కొంది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
గూగుల్ మ్యాప్స్‌ నుంచి ఆదిరిపోయే అప్‌డేట్.. ఫీచర్స్ తెలిస్తే..
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
చెంచాడు చెక్కరతో మీ స్కిన్ ను ముడతలు పడకుండా ఆపొచ్చని తెలుసా?
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
పిల్లలు స్మార్ట్ ఫోన్‌కు బానిసయ్యారా?.. AIIMS వైద్యుల టిప్స్ ఇవి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి
సకల శుభాలు కలగాలంటే.. ఉగాది ముందే ఇంటి నుంచి వీటిని తొలగించండి