Police Clearance Certificate: భారతీయులపై సౌదీ ఆరేబియా కీలక నిర్ణయం.. ఈ నిబంధన నుంచి సడలింపు

ఉపాధి నిమిత్తం భారతీయులు చాలా మంది వివిధ దేశాలకు వెళ్తుంటారు. చదువు, ఉద్యోగాలు, ఇతర ఉపాధి కోసం భారతదేశం నుంచి సౌదీ అరేబియాతో పాటు ..

Police Clearance Certificate: భారతీయులపై సౌదీ ఆరేబియా కీలక నిర్ణయం.. ఈ నిబంధన నుంచి సడలింపు
Police Clearance Certificate
Follow us
Subhash Goud

|

Updated on: Nov 18, 2022 | 7:24 AM

ఉపాధి నిమిత్తం భారతీయులు చాలా మంది వివిధ దేశాలకు వెళ్తుంటారు. చదువు, ఉద్యోగాలు, ఇతర ఉపాధి కోసం భారతదేశం నుంచి సౌదీ అరేబియాతో పాటు ఇతర దేశాలకు వెళ్తుంటారు. అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సదరు వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తారు. అతనిపై ఎలాంటి కేసులున్నాయో ఆ వ్యక్తి అడ్రాస్‌కు వెళ్లి విచారణ చేపడతారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా వెళ్లే వారికి గొప్ప ఊరటనిచ్చే వార్త ఇది. వీసా కోసం పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు . ఇంతకుముందు ఈ సర్టిఫికేట్ లేకుండా వీసా పొందడం కష్టం. అయితే ఈ నిబంధనను ఇప్పుడు చాలా సడలించారు. వీసా పొందడానికి ఈ సర్టిఫికేట్ చాలా ముఖ్యం. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నేర చరిత్రలో లేడని ఇది చూపిస్తుంది. అందుకే వీసా ఇచ్చిన వ్యక్తికి సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను పోలీసులు ముందుగా ఇస్తారు.

సౌదీ ఎంబసీ కీలక ప్రకటన:

పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ రద్దు గురించి సౌదీ అరేబియా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. సౌదీ రాయబార కార్యాలయం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. భారతదేశం, సౌదీ అరేబియా మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ కొత్త చర్య తీసుకోబడింది. సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, సౌదీ అరేబియా పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ (పీసీసీ) సమర్పణ నుండి భారతీయ పౌరులను మినహాయించాలని నిర్ణయించిందని పేర్కొంది.

రూల్స్‌ ఆఫ్ పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ రద్దుతో ప్రజలు సులభంగా వీసా పొందవచ్చు. ఎందుకంటే దీని కోసం దరఖాస్తుదారులు పోలీసు స్టేషన్ చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేట్ దరఖాస్తుదారుడు నివసించే పోలీస్ స్టేషన్ నుండి తీసుకోవాలి. ఏదైనా రెసిడెన్షియల్ స్టేటస్, ఉద్యోగం, ఇమ్మిగ్రేషన్ లేదా లాంగ్ స్టే వీసా కోసం దరఖాస్తు చేసుకునే పాస్‌పోర్ట్ హోల్డర్లు పోలీస్ స్టేషన్ నుండి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అయితే ఒక వ్యక్తి టూరిస్ట్ వీసాపై విదేశాలకు వెళితే, పిసిసి ఇవ్వాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ అడిగే దేశాల్లో కూడా ఉన్నాయి. ఈ జాబితాలో ప్రధానంగా ఆఫ్ఘనిస్తాన్, బహ్రెయిన్, ఇరాక్, ఇండోనేషియా, కువైట్, జోర్డాన్, లిబియా, లెబనాన్, మలేషియా, ఒమన్, ఖతార్, సూడాన్, సిరియా, థాయిలాండ్, యుఎఇ, యెమెన్ వంటి 16 దేశాలు ఉన్నాయి. ఇంతకుముందు సౌదీ అరేబియా పేరు కూడా ఈ జాబితాలో చేర్చబడింది. కానీ ఇప్పుడు ఈ దేశం ఈ నిబంధనను ఎత్తివేసింది. అక్కడ ఉపాధి కోసం వీసా తీసుకునేటప్పుడు భారతీయులు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి