China: క్వారంటైన్ లో చిన్నారి మృతి.. కఠిన లాక్ డౌన్ తో చుక్కుల చూస్తున్న చైనీయులు.. వెల్లువెత్తుతున్న నిరసనలు

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కొవిడ్ కోరలు చాస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు అధికారులు, ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కరోనా కేసులను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక మెడికల్..

China: క్వారంటైన్ లో చిన్నారి మృతి.. కఠిన లాక్ డౌన్ తో చుక్కుల చూస్తున్న చైనీయులు.. వెల్లువెత్తుతున్న నిరసనలు
China Lockdown
Follow us

|

Updated on: Nov 18, 2022 | 6:44 AM

కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కొవిడ్ కోరలు చాస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు అధికారులు, ప్రజల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. కరోనా కేసులను ఎలా కంట్రోల్ చేయాలో తెలియక మెడికల్ ఆఫీసర్స్ తలలు పట్టుకుంటున్నారు. కఠినంగా లాక్ డౌన్ విధించడమే శరణ్యమనుకున్న ప్రభుత్వం ఆ పనీ చేసింది. ఆంక్షలను కఠినతరం చేసింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైరస్‌ ను నిలువరించేందుకు డ్రాగన్ దేశం అవలంబిస్తున్న జీరో కొవిడ్‌ విధానంపై అక్కడి పౌరుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆంక్షల కారణంగా లక్షల మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారంటైన్‌లో ఉంచడం, అత్యవసర పరిస్థితుల్లోనూ వారిని బయటకు వెళ్లనీయకపోవడంపై అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఈ పరిస్థితుల నడుమ తాజాగా జరిగిన ఓ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. క్వారంటైన్‌లో ఉన్న ఓ చిన్నారికి సరైన సమయంలో వైద్యం అందక మృతి చెందడమే ఇందుకు కారణం.

చైనాలోని ఝేంగ్‌జువా నగరంలోని లాక్‌డౌన్‌ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. లక్షణాలు ఉన్న వారిని క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచుతున్నారు. ఇలాగే ఓ కుటుంబం నగరానికి దూరంగా ఉన్న హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంది. వారి నాలుగు నెలల పాప అస్వస్థతకు గురైంది. వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు చిన్నారికి ఏం జరిగిందో తెలియక తల్లడిల్లిపోయారు. ఆమెను ఆస్పత్రిలో చేర్చేందుకు ప్రయత్నించారు. కానీ కరోనా ఆంక్షల కారణంగా వారు బయటకు వెళ్లేందుకు అధికారులు ఒప్పుకోలేదు. 11 గంటల పాటు వేడుకున్నాక 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఆస్పత్రికి వెళ్లేందుకు అనుమతించారు.

కానీ అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. సరైన వైద్యం అందక, ఆరోగ్యం విషమించి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గతంలోనూ లాంఝువా నగరంలో ఇటువంటి ఘటనే జరిగింది. క్వారంటైన్‌లో ఉన్న మూడేళ్ల చిన్నారి అస్వస్థతకు గురయ్యింది. ఆసుపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి విషమించి ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రజలు ఆగ్రహంతో ఊగిపోయారు. నిరసనలు చేపట్టారు. వారి ఆందళనపై స్పందించిన ప్రభుత్వం.. ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయినప్పటికీ ఝేంగ్ జువా నగరంలో చిన్నారి మృతి చెందండం తీవ్ర సంచలనంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
సోషల్ మీడియాలో స్టైల్ మార్చిన లేడీ బాస్ సమంత.! ఫొటోస్ వైరల్.
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
పూజాహెగ్డే కు పెళ్లి ఫిక్స్ అయ్యిందా.? వరుడు అతనేనా.?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
డీమ్యాట్ ఖాతా అంటే ఏమిటి? ఏ పెట్టుబడిదారుడికి ఏది సరైనది?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
ఇందులో ఉన్న మలయాళీ కుట్టిని గుర్తుపట్టగలరా.. ?
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
జస్ట్ వెయ్యేనా.? ఇంకా పెంచమంటున్న పుష్పరాజ్‌.! బన్నీ నువ్వు కేక..
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
అఫీషియల్.. 'ముంజుమెల్ బాయ్స్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
రికార్డును బద్దలు కొట్టడానికి మంచులో నిల్చున్న వ్యక్తి..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
ఈ 7 లక్షణాలు కనిపిస్తున్నాయా? మీ కళ్లు బలహీనంగా మారుతున్నట్లే..
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
'96' సినిమాలో జాను స్నేహితురాలిగా కనిపించిన ఈ అమ్మాయి గుర్తుందా ?
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే
ఆ ప్రసాదంతో సంతానం కలుగుతుందని నమ్మకం.. అందుకే