AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kavya Maran : పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య పాప కొనడానికి కారణం తెలిసిందోచ్

Kavya Maran : ద హండ్రెడ్ 2026 వేలంలో సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని కావ్య మారన్ పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను రూ.2.3 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ వివాదాస్పద నిర్ణయంపై కోచ్ విట్టోరీ క్లారిటీ ఇచ్చారు. కావ్య మారన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

Kavya Maran : పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‎కు రూ.2.3 కోట్లు ఇచ్చి కావ్య పాప కొనడానికి కారణం తెలిసిందోచ్
Kavya Maran Abrar Ahmed
Rakesh
|

Updated on: Mar 13, 2026 | 4:05 PM

Share

Kavya Maran : క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒక సెన్సేషనల్ వార్త హల్‌చల్ చేస్తోంది. ఇంగ్లాండ్‌లో జరిగే ద హండ్రెడ్(The Hundred) 2026 సీజన్ వేలంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌కు చెందిన సన్‌రైజర్స్ లీడ్స్ ఫ్రాంచైజీ, పాకిస్థాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. సాధారణంగా ఐపీఎల్ యజమానులు ఇతర దేశాల్లోని లీగ్‌లలో కూడా పాక్ ఆటగాళ్లను తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ, కావ్య మారన్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

అసలు అబ్రార్ అహ్మద్‌ను ఎందుకు కొనాల్సి వచ్చిందో సన్‌రైజర్స్ లీడ్స్ కోచ్ డానియల్ విట్టోరీ క్లారిటీ ఇచ్చారు. వేలంలో తమ మొదటి ప్రాధాన్యత ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ అని, కానీ అతడిని సదరన్ బ్రేవ్స్ జట్టు దక్కించుకోవడంతో తాము వెంటనే వ్యూహం మార్చాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. విదేశీ స్పిన్నర్ కావాలి కాబట్టి, అందుబాటులో ఉన్న నలుగురైదుగురు ఆటగాళ్లలో అబ్రార్ బెస్ట్ ఆప్షన్ అని భావించి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ నిర్ణయం వెనుక ఎలాంటి రాజకీయ కారణాలు లేవని, కేవలం జట్టు అవసరాల రీత్యానే ఆటగాడిని ఎంపిక చేశామని విట్టోరీ స్పష్టం చేశారు.

అబ్రార్ అహ్మద్ గురించి ఆస్ట్రేలియా ఆటగాళ్ల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ కూడా ఈ కొనుగోలుకు ప్రధాన కారణం. అబ్రార్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, అతడి దగ్గర రకరకాల వేరియేషన్లు ఉన్నాయని ఆసీస్ ప్లేయర్స్ చెప్పారట. పవర్‌ప్లేలోనూ, మిడిల్ ఓవర్లలోనూ ప్రత్యర్థిని కట్టడి చేయగల సామర్థ్యం అబ్రార్‌కు ఉందని కోచ్ నమ్మకం వ్యక్తం చేశారు. అందుకే సుమారు రూ.2.3 కోట్ల భారీ ధర వెచ్చించి కావ్య మారన్ అతడిని టీమ్‌లోకి ఆహ్వానించారు. ఒక భారతీయ ఓనర్ పాక్ ఆటగాడిని ఇంత పెద్ద ధరకు కొనడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

నిజానికి 2008 ఐపీఎల్ తర్వాత పాకిస్థాన్ ఆటగాళ్లపై భారత్ లో అలిఖిత నిషేధం కొనసాగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు విదేశీ లీగ్‌లలో జట్లను కొన్నా కూడా పాక్ ప్లేయర్లను తీసుకోవడానికి భయపడుతుంటాయి. కానీ, కావ్య మారన్ మాత్రం అందరికంటే భిన్నంగా ధైర్యంగా అడుగు వేశారు. ఈ నిర్ణయం వల్ల సన్‌రైజర్స్ బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందోనని కొందరు అభిమానులు ఆందోళన చెందుతుండగా, మరికొందరు మాత్రం క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదని మద్దతు తెలుపుతున్నారు. ఏదేమైనా ఈ ఒక్క నిర్ణయంతో కావ్య మారన్ ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణపై కీలక అప్‌డేట్.. షెడ్యూల్
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
అయ్యబాబోయ్.. ఈ పాము ఎట్టా వేటాడుతుందో తెలిస్తే గుండెలు గుభేల్..
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
ఉగాది స్పెషల్.. మృదువైన, రుచికరమైన పప్పు బక్షాలు.. ఇంట్లోనే ఈజీగా
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
బిగ్ న్యూస్.. గ్యాస్ కొరతపై కేంద్రం భారీ ఊరట.. ఇకపై 24 గంటలు
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
పిల్లల్లో ప్రోటీన్ లోపం లక్షణాలు, గుర్తించే మార్గాలు..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
యూట్యూబ్‏లో దూసుకుపోతున్న దీవానా టీజర్..
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
రైళ్ల చివరి బోగీ వెనుక ఉండే 'X' గుర్తు రహస్యమిదే.. ఎవరికీ తెలియదు
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
పాక్ స్పిన్నర్ వివాదంపై బీసీసీఐ సెన్సేషనల్ క్లారిటీ
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
డిస్కౌంట్‌ చీరల కోసం ఎగబడిన మహిళలు.. కట్ చేస్తే..
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా
కొత్త ఏడాది ముందు గ్యాస్ కష్టాలు.. ఉగాది తర్వాత ధరల విలయతాండవమేనా