AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీవారినిజీవితంలో ఒక్కసారైనా..ఇలా చూశారా?

శ్రీవారినిజీవితంలో ఒక్కసారైనా..ఇలా చూశారా?

Samatha J
|

Updated on: Apr 26, 2026 | 1:46 PM

Share

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు.. కోరిన కోర్కెలను తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం.. భక్త జనుల కొంగు బంగారం ఆ వేంకటాచలపతి. పిలిచినంతనే పలికే ఆపద్బాంధవుడు.. భక్త జనులకు కొండంత అండ ఆయనే. అందుకే శతాబ్దాలుగా తిరుమల అతి పెద్ద హిందూ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. కోట్లాది మంది భక్తులకు ఒక దివ్య ఆశ్రయం. నిత్యం సకల జనులను కాపాడే ఆ వేంకటాచలపతిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు సకల పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఏడేడు లోకాలను కాచే ఆ దేవదేవుని దివ్యమంగళ స్వరూపాన్ని కనులారా చూసేందుకు ఏడు కొండలూ ఎక్కి తమ భక్తిని చాటుకుంటారు శ్రీవారి భక్తులు.

ఆ దేవదేవుడైన వేంకటేశ్వరుణ్ణి మనం ఎప్పుడూ రకరకాల ఆభరణాలు, అలంకారాలతో చూస్తుంటాం. కానీ, స్వామివారిని ఎప్పుడైనా నిజరూపంలో దర్శించుకున్నారా? ఆ అరుదైన భాగ్యం భక్తులకు కేవలం ఒక్క గురువారం మాత్రమే దక్కుతుందని మీకు తెలుసా? అవును… ప్రతి గురువారం వేకువజామున జరిగే రెండో అర్చన తర్వాత, స్వామివారు ఎలాంటి ఆభరణాలు లేకుండా దర్శనమిస్తారు. ఈ విశేష సమయాన్నే భక్తులు ‘నేత్ర దర్శనం’ లేదా నిజరూప దర్శనం అని పిలుచుకుంటారు. ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి, పై వల్లెవాటు, మెడలో కంటెలు, నొసటన సన్నని నామం, బుగ్గన పచ్చకర్పూరపు చుక్క, తలకు చుట్టూ సొగసుగా చుట్టిన తలగుడ్డతో, నగుమోముతో దేదీప్యమానంగా దర్శనమిస్తారు స్వామి.సాధారణంగా స్వామివారి నుదుటిపై పెద్ద పచ్చకర్పూరపు నామం ఉంటుంది. కానీ గురువారం నాడు ఆ నామాన్ని బాగా తగ్గించి, స్వామివారి నేత్రాలు (కళ్లు) స్పష్టంగా కనిపించేలా చేస్తారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది.ఆభరణాలకు బదులుగా స్వామికి 24/4 కొలతలు గల పట్టు ధోవతిని, యజ్ఞోపవీతంగా పట్టు ఉత్తరీయాన్ని అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటం తీసి, ఒక పట్టువస్త్రాన్ని తలపాగాగా చుడతారు. నుదుటన సన్నని నామం, బుగ్గన చిన్న పచ్చకర్పూరపు చుక్కతో, మెడలో కంటెలు ధరించి నిజరూపంలో దర్శనమిస్తారు. ఇలా ప్రతి గురువారం శ్రీవారికి ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. సడలింపు, నిజరూప దర్శనం, అన్నకూటోత్సవం, పూలంగి సేవ గురువారాల్లో మాత్రమే నిర్వహిస్తారు. ఆ రోజంతా భక్తులకు శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌

 

Follow Us