చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో సత్తా చాటుతున్న తెలుగుమ్మాయిలకు పెద్ద చిత్రాల్లో అవకాశాలు కరువవుతున్నాయి. రాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్ ఎనిమిది వసంతాలు వంటి చిత్రాలతో మెప్పించినా, స్టార్ హీరోల పక్కన కనిపించలేకపోతున్నారు. పాన్ ఇండియా ట్రెండ్, గ్లామర్ వంటి కారణాలతో బాలీవుడ్ భామల వైపు నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల స్థానిక నటీమణులు ఉన్నత స్థాయికి చేరడం సవాలుగా మారింది.
ఒకప్పుడు టాలీవుడ్‌లో చిన్న సినిమాతో హిట్ కొట్టిన తెలుగుమ్మాయిలకు వెంటనే స్టార్ హీరోల సరసన అవకాశాలు లభించేవి. కానీ నేటి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. కంటెంట్ ఉన్న చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరచిన యువ కథానాయికలకు టాప్ లీగ్‌లో స్థానం దక్కడం లేదు. ఈ అంతరానికి గల కారణాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. రాజారాజు వెడ్స్ రాంబాయి, కోర్ట్ ఎనిమిది వసంతాలు వంటి సినిమాల్లో హీరోయిన్ల నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. స్క్రీన్ ప్రెజెన్స్‌లో వీరు ఏ స్టార్ హీరోయిన్‌కు తీసిపోరనే ప్రశంసలు అందుకున్నారు. అయినా సరే, తదుపరి ప్రాజెక్ట్‌లకు వచ్చేసరికి వీరిని చిన్న సినిమాలకే పరిమితం చేస్తున్నారు. ఈ జాబితాలో వైష్ణవి చైతన్య పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కల్ట్ బ్లాక్‌బస్టర్‌తో కెరీర్ ప్రారంభించిన ఈ తెలుగమ్మాయికి మీడియం రేంజ్ హీరోల నుంచి ఆఫర్లు వస్తున్నప్పటికీ, స్టార్ హీరోల క్యాంప్ నుంచి పిలుపు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

