AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే శరీరంలో ఇంత జరుగుతుందా.. వామ్మో తెలిస్తే షాకే..

ఈ ఎండల్లో బయట నుంచి రాగానే మన చేతులు ముందుగా వెతికేది ఫ్రిజ్‌లోని ఆ చల్లటి నీళ్ల సీసానే. గొంతులోకి ఐస్ వాటర్ వెళ్తుంటే ఆ క్షణానికి హాయిగా అనిపించవచ్చు.. కానీ ఆ నీరు మీ శరీరంలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో తెలుసా? అజీర్తి నుంచి గుండె వేగం తగ్గడం వరకు.. చివరకు మెదడుపై కూడా ఇది ప్రభావం చూపుతుందట.

ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే శరీరంలో ఇంత జరుగుతుందా.. వామ్మో తెలిస్తే షాకే..
Side Effects Of Cold WaterImage Credit source: Getty Images
Krishna S
|

Updated on: Apr 26, 2026 | 9:51 PM

Share

ఎండలు మండిపోతున్నాయి. బయట తిరిగి రాగానే గొంతు ఎండిపోయి, ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి నీటిని గటగటా తాగేస్తుంటాం. ఆ క్షణానికి అది ఎంతో హాయినిచ్చినా, మీ శరీరం లోపల మాత్రం అది ఒక విధ్వంసాన్నే సృష్టిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్రిజ్ నీరు నేరుగా తాగడం వల్ల కలిగే అనర్థాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భోజనం చేసిన వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల కడుపులోని రక్తనాళాలు అకస్మాత్తుగా సంకోచిస్తాయి. దీనివల్ల జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్‌ల పనితీరు నెమ్మదిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మీరు తిన్న ఆహారంలోని కొవ్వు పదార్థాలు చల్లటి నీటి వల్ల గడ్డకట్టి, పేగుల గుండా కదలడం కష్టమవుతుంది. ఇది కడుపు ఉబ్బరం, అజీర్తికి దారితీస్తుంది.

గొంతులో శ్లేష్మం.. ఇన్ఫెక్షన్లకు దారి

చల్లటి నీరు తాగడం వల్ల శ్వాసనాళంలో రక్షణ పొరగా ఉండే శ్లేష్మం పరిమాణం పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లకు దారితీయడమే కాకుండా కఫం పట్టడం, గొంతు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. సాధారణ ప్రజలలో కూడా ఇది శ్వాసకోశ ఇబ్బందులకు కారణం కావచ్చు.

మెదడుపై ప్రభావం.. ఆకస్మిక తలనొప్పి

అత్యంత చల్లని నీరు తాగినప్పుడు వెన్నెముకలోని నరాలు చల్లబడి, మెదడుకు తప్పుడు సంకేతాలు పంపుతాయి. దీనివల్ల హఠాత్తుగా తలనొప్పి రావచ్చు. మైగ్రేన్ సమస్య ఉన్నవారికి ఇది పరిస్థితిని మరింత తీవ్రం చేస్తుంది. సైనస్ బాధితులకు చల్లని నీరు ఒక శాపం లాంటిదని చెప్పాలి.

దంత ఆరోగ్యంపై దెబ్బ

మంచు లాంటి నీరు పళ్లపై ఉండే అత్యంత కీలకమైన ఎనామెల్ పొరను బలహీనపరుస్తుంది. దీనివల్ల పళ్లలో సెన్సిటివిటీ పెరిగి, దంతాలు త్వరగా పాడైపోయే ప్రమాదం ఉంది. చిగుళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.

సరైన మార్గం ఏంటి?

శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 10-12 గ్లాసుల నీరు తాగడం తప్పనిసరి. అయితే అది ఫ్రిజ్ నీరు కాకుండా చూసుకోవాలి.వేసవిలో నీటిని చల్లబరచడానికి మట్టి కుండలే అత్యుత్తమం. ఇవి సహజంగా నీటిని చల్లబరచడమే కాకుండా, నీటిలోని పోషకాలను పెంచుతాయి. జీర్ణక్రియ మెరుగుపడటానికి, దంత ఆరోగ్యం కోసం గోరువెచ్చని నీరు ఎల్లప్పుడూ శ్రేయస్కరం. గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదు.

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం వివిధ ఆరోగ్య నివేదికల ఆధారంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరి శరీరతత్వం వేర్వేరుగా ఉంటుంది.. కాబట్టి ఏదైనా కొత్త డైట్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం.)

Follow Us
ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే శరీరంలో ఇంత జరుగుతుందా..?
ఎండాకాలంలో చల్లటి నీళ్లు తాగితే శరీరంలో ఇంత జరుగుతుందా..?
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. మెహ్రీన్ భర్త ఎవరో చూశారా..
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. మెహ్రీన్ భర్త ఎవరో చూశారా..
వింత నిబంధనతో అవుటైన బ్యాటర్.. మైదానంలో హైడ్రామా!
వింత నిబంధనతో అవుటైన బ్యాటర్.. మైదానంలో హైడ్రామా!
ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. వంటింట్లోని వస్తువులతో..
ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా.. వంటింట్లోని వస్తువులతో..
బరువు తగ్గాలని ఇవి తినడం మానేస్తున్నారా?.. జాగ్రత్త.. ఇక మీ బాడీ
బరువు తగ్గాలని ఇవి తినడం మానేస్తున్నారా?.. జాగ్రత్త.. ఇక మీ బాడీ
LSG vs KKR: మొహ్సిన్ ఖాన్ దెబ్బకు కుదేలైన కేకేఆర్.. కట్‌చేస్తే..
LSG vs KKR: మొహ్సిన్ ఖాన్ దెబ్బకు కుదేలైన కేకేఆర్.. కట్‌చేస్తే..
అల్లు అర్జున్ కు నేనే డ్రాయింగ్ టీచర్‏ను..
అల్లు అర్జున్ కు నేనే డ్రాయింగ్ టీచర్‏ను..
మీరు వాడిన దానికంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందా.. ఒక్క కాల్‌తో
మీరు వాడిన దానికంటే ఎక్కువ కరెంట్ బిల్లు వస్తుందా.. ఒక్క కాల్‌తో
ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఈ రైలు ఎక్కలేరు.. ఎక్కడో తెలుసా..?
ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఈ రైలు ఎక్కలేరు.. ఎక్కడో తెలుసా..?
కోల్‌కతాలో కాళీమాతా ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
కోల్‌కతాలో కాళీమాతా ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..