వేసవిలో పెరుగు త్వరగా పుల్లగా మారకూడదంటే ఇలా చేయండి..
26 April 2026
TV9 Telugu
TV9 Telugu
ప్రతి ఇంటి వంటగదిలో పెరుగు తప్పనిసరిగా ఉంటుంది. చల్లదనం కోసం పెరుగును ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవడం మన తెలుగు వారికి అలవాటు
TV9 Telugu
పెరుగుతో మజ్జిగ, లస్సీ వంటి వాటిని తయారు చేసి తీసుకుంటూ ఉంటారు. అయితే వేసవికాలంలో ఇంట్లో పెరుగు పెట్టడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది
TV9 Telugu
సాధారణంగా పెరుగు క్రీమీగా, మృదువుగా ఉండాలి. కానీ వేసవిలో పెరుగు వేడి కారణంగా చాలా త్వరగా పుల్లగా మారిపోతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో ఫెర్మెంటేషన్ వేగంగా జరుగుతుంది
TV9 Telugu
అయితే ఈ సమస్యకు ఒక చిన్న చిట్కా మంచి పరిష్కారం చూపుతుంది. ఈ చిట్కా పెరుగును తీపిగా మార్చదు కానీ ఫెర్మెంటేషన్ ప్రక్రియను సమతుల్యం చేస్తుంది
TV9 Telugu
ఈ చిట్కాను ఉపయోగించే విధానం కూడా సులభమే. ముందుగా పాలను వేడి చేసి కొద్దిగా చల్లార్చాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు పాత పెరుగు (స్టార్టర్) వేసి కలపాలి
TV9 Telugu
ఆ తర్వాత ఒక లీటర్ పాలకు సుమారు పావు టీ స్పూన్ చక్కెర వేసి నెమ్మదిగా కలపాలి. తరువాత మూతపెట్టి కదలకుండా ఉంచాలి. అయితే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఎక్కువ చక్కెర వేస్తే రుచి మారిపోతుంది
TV9 Telugu
చల్లని కాలంలో ఈ చిట్కా అవసరం ఉండదు. అలాగే చాలా వేడి పాలలో చక్కెర వేయకూడదు. ఇది కల్చర్‌పై ప్రభావం చూపుతుంది
TV9 Telugu
వేసవిలో రాత్రికి పెరుగు పెట్టేటప్పుడు, లేదా పెరుగు త్వరగా పుల్లగా మారుతున్నప్పుడు ఈ చిన్న చిట్కా ఎంతో ఉపయోగపడుతుంది. చిన్న మార్పు అయినప్పటికీ, మంచి రుచితో స్థిరమైన పెరుగు పొందడానికి ఇది సహాయపడుతుంది