AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రుబ్బిన దోస లేదా ఇడ్లీ పిండిని.. ఎన్ని రోజుల వరకు వాడొచ్చు! పాడవకుండా ఎలా స్టోర్ చేయాలి!

ఈ మధ్య కాలంలో పెరుగుతున్న కల్తీ నేపథ్యంలో జనాలు బయట తినడం కన్నా ఇంట్లో తినేందుకు ఎక్కువ ప్రధాన్యత ఇస్తున్నారు. అందుకే మార్నింగ్ టిఫిన్స్‌ బయట తినకుండా ఇంట్లోనే చేసుకుంటున్నారు. అయితే సాధారణంగా చాలా మంది దోశ లేదా ఇడ్లీ పిండిని రుబ్బుకొని ప్రిజ్‌లో పెట్టుకొని రెండు మూడు రోజులు వాతుడూ ఉంటారు. కానీ, ఇంట్లో తయారుచేసే ఈ పిండిని నిల్వ చేసే విషయంలో, ఇలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకొని తినడం మంచి కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి రుబ్బిని దోశపిండిని ఎన్ని రోజుల వరకు తినొచ్చు ఇక్కడ తెలుసుకుందాం.

రుబ్బిన దోస లేదా ఇడ్లీ పిండిని.. ఎన్ని రోజుల వరకు వాడొచ్చు! పాడవకుండా ఎలా స్టోర్ చేయాలి!
Dosa Batter Storage
Anand T
|

Updated on: Apr 26, 2026 | 6:37 PM

Share

సాధారణంగా మనకు బ్రేక్‌ఫాస్ట్ అనంగానే గుర్తొచ్చే ఫుడ్‌ ఏదైనా ఉందంటే, అది దోశ, ఇడ్లీ మాత్రమే. దక్షిణ భారతీయుల ఇళ్లలో ఉదయం టిఫిన్ అంటే కచ్చితంగా ఇడ్లీ, దోస ఉండాల్సిందే. ఇవి రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి వీటిని తినేందుకు జనాలు ఎక్కవా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అయితే, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌ కారణంగా ప్రతిరోజూ పిండి రుబ్బడం కష్టమైన పని కాబట్టి, వారం రోజులకు సరిపడా పిండిని ఒకేసారి తయారు చేసి స్టోర్ చేసుకొని వాటితోనే రోజు టిఫిన్స్ చేసుకుంటున్నారు జానాలు. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దోస పిండిని 3 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదని సూచిస్తున్నారు.

దోశ లేదా ఇడ్లీ పిండిని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవడం బెస్ట్

దోస లేదా ఇడ్లీ పిండిని మూడు రోజులకు మించి స్టోర్ చేసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దోస పిండిని బియ్యం, మినప్పప్పుతో తయారు చేస్తారు. ఇది పులియడం వల్ల అందులో ప్రోబయోటిక్స్ పెరుగుతాయి. అయితే, పిండిని ఫ్రిజ్‌లో ఉంచినప్పటికీ ఈ పులిసే ప్రక్రియ పూర్తిగా ఆగదు, కేవలం నెమ్మదిస్తుంది. 3 రోజుల తర్వాత పిండిలోని కార్బోహైడ్రేట్లు విచ్ఛిన్నమై, ఆల్కహాల్ వంటి పదార్థాలు, హానికరమైన ఈస్ట్‌లు ఉత్పత్తి చేస్తాయి. ఈ పిండిని అలానే తినడం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చు.

ఎక్కవ కాలం స్టోర్ చేసుకొని తింటే వచ్చే సమస్యలు

పిండి ఎక్కువ కాలం నిల్వ ఉంటే అందులో ఆమ్ల గుణం పెరుగుతుంది. దీనివల్ల దోసలు తిన్న తర్వాత కడుపులో మంట లేదా గుండెల్లో మంట కలగవచ్చు. పాత పిండిలో సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. దీనివల్ల వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి వంటి ఫుడ్ పాయిజనింగ్ జరగవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్న పిల్లలకు, వృద్ధులకు ఇది అస్సలు మంచిది కాదు.

ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా రుబ్బుకోండి 

కాబట్టి మీకు అవసరమైనప్పుడు మాత్రమే పిండిని రుబ్బుకోవడం మంచిది. ఒక వేళ మీకు కావాలి అంటే ఈ పిండిని కేవలం 1 లేదా 2 రోజులు మాత్రమే వాడండి. అయితే రుబ్బిన పిండిని నిల్వ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాల కంటే స్టీల్ లేదా గాజు పాత్రలను వాడటం మంచిది. అలాగే పిండిని ఫ్రిజ్‌లో పెట్టే ముందే అందులో ఉప్పు అస్సలు కలపకండి. ఉప్పు కలపకపోతే పిండి త్వరగా పులియదు. మీరు ఎప్పుడు దోసలు వేయాలనుకుంటారో, అప్పుడు మాత్రమే అవసరమైనంత పిండిని తీసుకుని ఉప్పు కలుపుకుంటే సరిపోతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us