తేనె తియ్యగా ఉంటుందని, ఒంటికి మంచిదని మనకు తెలుసు. కానీ ఎలా వాడాలి, ఎందులో కలపాలి అనేది ఎప్పుడూ డౌటే
TV9 Telugu
అందుకే వంటల్లో ఎలా ఉపయోగించవచ్చో ఏలూరులోని తేనెటీగల పెంపకం పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె మోహనరావు చెబుతున్నారు
TV9 Telugu
ఎండుఫలాలు అంటే బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్, పిస్తా, ఎండు ఖర్జూరం ఏవైనా సరే పొడిలో కొద్దిగా తేనె కలిపి తింటే తక్షణ శక్తి ఇస్తుంది
TV9 Telugu
బాగా అలసటగా అనిపించినప్పుడు ఇలా చేయొచ్చు. ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా! వ్వకేసరి, హల్వా... వంటివి చేసినప్పుడు చక్కెరతోపాటు కొంత తేనె వేస్తే కమ్మగా ఉంటుంది
TV9 Telugu
డబుల్‌కామీఠా.. స్వీట్‌లో దాల్చినచెక్క, యాలకులు, డ్రైఫ్రూట్స్‌తోపాటు తేనెనూ కలపొచ్చు. గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూన్ తేనె కలిపి తాగితే ఒత్తిడి తగ్గి నిద్రలేమి సమస్య ఉండదు
TV9 Telugu
వేడి వాతావరణంలో పనిచేసేటప్పుడు తేనె తీసుకోకూడదు. వేడి వేడి మసాలా పదార్థాల్లో వేయకూడదు. ఇలా చేస్తే హైడ్రాక్సీ మిథైల్ పెరిగి యాంటీ ఆక్సిడెంట్ స్థాయులు తగ్గుతాయి
TV9 Telugu
బాగా కారంగానూ వేడిగానూ ఉన్న ఆహార పదార్థాల్లో తేనె కలిపితే అసమతుల్యం ఏర్పడుతుందని ఆయుర్వేదంలోనూ ఉంది
TV9 Telugu
ఆల్కహాల్, నూనెలోనూ దీన్ని కలపకూడదు. ఎప్పుడైనా పరిమితంగా తీసుకుంటే మంచిది. 18 నెలల్లోపు పిల్లలకు ఇవ్వకూడదు. మధుమేహులు వైద్యుల సలహా మేరకే వాడాలి