AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diet and Health: బరువు తగ్గాలనుకునే వారు మైదాను ముట్టకూడదా?.. నిపుణులు ఇస్తోన్న ఫుల్ లిస్ట్..

భారతీయ వంటగదిలో రొట్టెలు, చపాతీలు, పూరీలు వివిధ రకాల పిండి వంటలకు విపరీతమైన ప్రాధాన్యత ఉంది. రోజువారీ ఆహారంలో మనం ఏదో ఒక రూపంలో పిండి పదార్థాలను తీసుకుంటూనే ఉంటాం. అయితే, పూర్వ కాలంలో కేవలం జొన్నలు, రాగులు, సజ్జలు వంటి తృణధాన్యాల పిండిని ఎక్కువగా వాడేవారు. కానీ, ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో పాలిష్ చేసిన గోధుమ పిండి, మైదా పిండి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మనం తినే పిండి రకాన్ని బట్టే మన ఆరోగ్యం, జీర్ణక్రియ బరువు ఆధారపడి ఉంటాయి.

Diet and Health: బరువు తగ్గాలనుకునే వారు మైదాను ముట్టకూడదా?.. నిపుణులు ఇస్తోన్న ఫుల్ లిస్ట్..
Indian Flours Ranking For Health
Bhavani
|

Updated on: Jul 13, 2026 | 3:49 PM

Share

మన దేశంలో విస్తృతంగా ఉపయోగించే 8 రకాల పిండి పదార్థాలను, వాటిలోని పోషక విలువల ఆధారంగా అత్యంత ఆరోగ్యకరమైన వాటి నుండి ఆరోగ్యానికి హాని చేసే వాటి వరకు వర్గీకరించారు. మరి ఆ 8 రకాల పిండి పదార్థాల ర్యాంకింగ్ ఏంటో, ఏది తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. రాగి పిండి ఆరోగ్యపరంగా రాగి పిండి అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇందులో క్యాల్షియం, ఐరన్ ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. గ్లూటెన్ రహితమైన ఈ పిండి మధుమేహ బాధితులకు, బరువు తగ్గాలనుకునే వారికి ఎముకల బలానికి అత్యంత ఉత్తమమైనది.

2. జొన్న పిండి జొన్నల్లో ప్రొటీన్లు, పీచుపదార్థాలు యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి అద్భుతంగా సహాయపడుతుంది.

3. సజ్జ పిండి సజ్జలు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. ఇందులో మెగ్నీషియం, పొటాషియం ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి తోడ్పడుతుంది.

4. శనగ పిండి శాకాహారులకు శనగపిండి ఒక మంచి ప్రొటీన్ వనరు. ఇందులో కార్బోహైడ్రేట్లు తక్కువగా, ప్రొటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అకస్మాత్తుగా పెంచకుండా నిరోధిస్తుంది.

5. ఓట్స్ పిండి ఓట్స్‌లో ఉండే బీటా-గ్లూకాన్ అనే పీచు పదార్థం గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.

6. తవుడు తీయని గోధుమ పిండి సాధారణంగా ఇళ్లలో వాడే హోల్ వీట్ అట్టాలో ఫైబర్, విటమిన్లు ఉంటాయి. ఇది మైదా కంటే ఎంతో మేలైనప్పటికీ, ఇందులో గ్లూటెన్ ఉంటుంది. కాబట్టి గ్లూటెన్ పడని వారు దీనికి దూరంగా ఉండాలి.

7. బియ్యం పిండి బియ్యం పిండి గ్లూటెన్ రహితమైనదే అయినప్పటికీ, ఇందులో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువగా ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరుగుతాయి. కాబట్టి దీనిని పరిమితంగా వాడాలి.

8. మైదా పిండి గోధుమలను విపరీతంగా ప్రాసెస్ చేసి, తవుడు పోషకాలను పూర్తిగా తొలగించడం ద్వారా మైదా తయారవుతుంది. ఇందులో ఎలాంటి ఫైబర్ గానీ, పోషకాలు గానీ ఉండవు. దీనిని అతిగా తినడం వల్ల ఊబకాయం, మలబద్ధకం, డయాబెటిస్ గుండె జబ్బుల ప్రమాదం తీవ్రమవుతుంది. కాబట్టి దీనిని సాధ్యమైనంత వరకు పూర్తిగా దూరం పెట్టడం మంచిది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న వివరాలు వివిధ పోషకాహార నివేదికలు, డైటీషియన్ల సూచనలు ఆరోగ్య విశ్లేషణల ప్రాతిపదికన అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి, దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు. మీ శరీర అవసరాలు, ఆరోగ్య సమస్యలను బట్టి ఏ పిండిని ఎంత మొత్తంలో తీసుకోవాలో క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సలహా మేరకు నిర్ణయించుకోవడం శ్రేయస్కరం.

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..