Health Tips: బరువు తగ్గాలని ఇవి తినడం మానేస్తున్నారా?.. జాగ్రత్త.. ఇక మీ బాడీ షెడ్డుకే!
ఈ మధ్య కాలంలో చాలా మంది స్లిమ్ అండ్ ఫిట్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. అందుకని ఫ్యాట్ లాస్ డైట్స్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాట్ ఫ్రీ ఆహారాలను తినేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇదే దీర్ఘకాలంగా కొనసాగితే తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఫ్యాట్ ఫ్రీ ఫుడ్ వల్ల ఎలాంటి సమస్యలు వాస్తాయో తెలుసుకుందాం పదండి.

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్యాట్-ఫ్రీ ఆహారం తీసుకోవడమే ముఖ్యమని నమ్ముతున్నారు. బరువు తగ్గడానికో లేదా ఆరోగ్యం కోసమో ఇలా ఏదో కారణం చేతా చాలా మంది ఫ్యాట్ ఫుడ్స్‌ను పూర్తిగా మానేస్తున్నారు. కానీ ఇది అంతమంచిది కాదన పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి కేవలం పోషకాలు ఉంటే సరిపోదని.. వాటిని గ్రహించే శక్తి కూడా ఉండాలంటున్నారు. ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ప్రకారం.. ఫ్యాట్ ఫుడ్స్‌ను పూర్తిగా మానేయడం వల్ల శరీరంలో పోషకాలను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుందని ఆమె స్పష్టం చేశారు.
మన శరీరానికి ఫ్యాట్స్ ఎందుకు అవసరం?
మనం తినే ఆహారంలోనే పోషకాల గ్రహించడంలో కొవ్వు కీలకంగా పనిచేస్తుంది. విటమిన్ A, D, E, K లు కొవ్వులో కరిగే స్వభావం కలిగి ఉంటాయి. అంటే ఇవి శరీరానికి అందాలంటే ఆహారంలో కొవ్వు ఉండాలి. ఒకవేళ మీ ఆహారంలో కొవ్వు లేకపోతే, ఈ విటమిన్లు మీ జీర్ణవ్యవస్థ ద్వారా సరిగ్గా గ్రహించబడవు. అగర్వాల్ ప్రకారం కొవ్వు లేకపోతే ఈ మనం తీసుకునే పోషకాలు ఉపయోగపడకుండానే ప్రేగుల నుండి బయటకు వెళ్లిపోతాయి.అంటే మన శరీరం విటమిన్ D గ్రహించడానికి కొవ్వు అవసరం. ఒకసారి విటమిన్ D అందిన తర్వాతే, అది శరీరంలో కాల్షియం, మెగ్నీషియంను గ్రహించడంలో సహాయపడుతుంది. అంటే కొవ్వు లేకపోతే ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఈ గొలుసుకట్టు ప్రక్రియ మొత్తం దెబ్బతింటుంది.
డాక్టర్ చేసిన పోస్ట్ ఇక్కడ చూడండి
View this post on Instagram
కొవ్వును ఇలా ఆహారంలో చేర్చుకోండి
అయితే మీరు క్లీన్ ఈటింగ్ పేరుతో కొవ్వును పూర్తిగా మానేయకుండా తక్కువ పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం మీరు రోజువారి జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ భోజనంలో గింజలు, విత్తనాలు లేదా మంచి నూనెలను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఒకవేళ మీరు విటమిన్ టాబ్లెట్లు వాడుతుంటే, వాటిని ఖాళీ కడుపుతో కాకుండా భోజనం చేసిన తర్వాత తీసుకోండి. కొవ్వు అనేది శత్రువు కాదు, అది మీ శరీరానికి పోషకాలను అందించే ఒక వాహనం లాంటిది. కాబట్టి దాన్ని అస్సలు నెగ్లేట్ చేయకండి.
Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
