AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూట్యూబ్‌ వీడియోలతో కోట్లు కొల్లగొడుతున్న స్టార్లు

యూట్యూబ్‌ వీడియోలతో కోట్లు కొల్లగొడుతున్న స్టార్లు

Samatha J
|

Updated on: Apr 26, 2026 | 1:55 PM

Share

సినీ, టీవీ సెలబ్రిటీలు యూట్యూబ్‌ను భారీ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. తమకున్న పాపులారిటీతో తక్కువ సమయంలోనే లక్షల సబ్‌స్క్రైబర్‌లను పొంది, యాడ్ రెవెన్యూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. యూట్యూబ్ ఆర్థిక వ్యవస్థ, CPM, RPM వంటి అంశాలను అర్థం చేసుకుని, వ్యక్తిగత వ్లాగ్‌లతో అభిమానులకు చేరువవుతూ లాభాలు గడిస్తున్నారు.

ఇంట గెలవకపోయినా యూట్యూబ్‌లో గెలిస్తే చాలు అనే స్థాయికి నేటి సెలబ్రిటీలు చేరుకున్నారు. పేరుతో పాటు భారీ ఆదాయాన్ని అందించే యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్, సినిమా తారలు, టీవీ సెలబ్రిటీలకు సుస్థిరమైన ఆదాయ వనరుగా మారింది. తమ దైనందిన కార్యకలాపాలు, వ్యక్తిగత విశేషాలను వీడియోలుగా మలిచి మిలియన్ల వీక్షణలు పొందుతూ, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో కలిపి ప్రతి నెలా లక్షల్లో సంపాదిస్తున్నారు.
యూట్యూబ్ ద్వారా ఆదాయం యాడ్ రెవెన్యూ, క్రియేటర్ ఎకానమీ, అల్గారిథమ్ ఎఫెక్ట్ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. CPM (కాస్ట్ పర్ మిల్లే), RPM (రెవెన్యూ పర్ మిల్లే) అనేవి యూట్యూబ్ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణ క్రియేటర్ల కంటే సెలబ్రిటీలు తమకు ఇప్పటికే ఉన్న ఫాలోయింగ్‌తో వేగంగా సబ్‌స్క్రైబర్‌లను పెంచుకొని, తక్కువ సమయంలోనే మానిటైజేషన్ పొందగలుగుతున్నారు. దీనికి తోడు బ్రాండ్లు కూడా సాధారణ క్రియేటర్ల కంటే సెలబ్రిటీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో వారికి బ్రాండ్ డీల్స్, స్పాన్సర్ షిప్‌ల రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. లైఫ్‌స్టైల్ వ్లాగ్‌లు, షూటింగ్ విశేషాలు, ఫిట్‌నెస్ చిట్కాలు వంటి కంటెంట్‌తో సోనాక్షి సిన్హా, ఆలియా భట్, శిల్పా శెట్టి, నాగచైతన్య, సమంత వంటి తారలు యూట్యూబ్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌

Follow Us