అరటి పండ్లు ఎందుకు ఆకాశం వైపు చూస్తుంటాయి?

26 April 2026

TV9 Telugu

TV9 Telugu

పూజ, వ్రతం, పెళ్లి, పేరంటం.. ఇలా మన ఆచారాలూ సంప్రదాయాల్లో అరటిపండుకు ప్రత్యేక స్థానం ఉంది కదా! భగవంతుడికి సమర్పించడానికి ఇతర పండ్లు ఎన్నున్నా.. అరటిపండు తప్పనిసరిగా ఉంటుంది

TV9 Telugu

ఇవి అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. అంతకుమించి ఈ పండ్లను శుభసూచకంగా భావిస్తారు. అందుకే అరటిపండు విశిష్టమైనది. సపోటా, శీతాఫలం వంటి పండ్లలో గుజ్జు తిని గింజలను పడేస్తాం

TV9 Telugu

అలా పారేసిన విత్తనాలు మళ్లీ మొలకెత్తి వృక్షాలై.. తిరిగి పండ్లను ఇస్తాయి. అంటే ఎంగిలి విత్తనాల నుంచి వచ్చిన చెట్ల ఫలాలను మనం ఆరగిస్తాం. దేవుడికి కూడా నివేదిస్తాం. కానీ, అరటిపండు అలా కాదు. పూర్తిగా తినేస్తాం 

TV9 Telugu

కాబట్టి గింజలు పారేయడం, తిరిగి మొలకెత్తడం ఉండదు. పిలక మొక్కల ద్వారా అరటితోట వృద్ధి చెందుతుంది. ఈ కారణం వల్ల అరటిపండును దేవునికి సమర్పించడం శ్రేష్టమని, ఇది పూర్ణఫలమని పెద్దలు చెబుతారు

TV9 Telugu

అరటిపండు మరో విశిష్టత ఏమంటే.. అరటి పండు అలా 'C'ఆకారంలో  వంగి ఎందుకు ఉంటుంది? ఈ డౌట్‌ మీకు ఎప్పుడైనా వచ్చిందా?

TV9 Telugu

అరటి గెలలో ప్రతి పండూ వంగే ఉంటుంది. దీనికి కారణం ఉంది. అరటి చెట్టుకి కాసిన గెల కిందకు వేలాడుతున్నా దాని పండ్లు మాత్రం ఆకాశం వైపుకు చూస్తుంటాయి. దీన్ని ‘నెగటివ్‌ జియోట్రోపిజం’ అంటారు

TV9 Telugu

అంటే సూర్యుడి వైపు పెరగడం. చిన్నప్పుడు అన్ని పండ్లు కిందకే ఉంటాయి. పెరిగే కొద్దీ ఎండ కోసం పైకి వంగుతాయి. అందుకే అరటిపండు షేప్‌ వంకరగా వస్తుంది. అరటిపండులో  పొటాషియం ఎక్కువ

TV9 Telugu

అది గుండెకు, కండరాలకు మంచిది. పండిన అరటిపండు మీద నల్ల మచ్చలు వస్తాయి. వాటిని షుగర్‌ స్పాట్స్‌ అంటారు. ప్రపంచంలో వెయ్యి రకాల అరటిపండ్లు ఉన్నాయి