వామ్మో.. అతని ఒంటి నిండా తేనెటీగలే..!
తేనెటీగ.. పేరులో తేనె ఉందికానీ.. దీని ఒంట్లో మాత్రం విషమే ఉంటుంది.. కుట్టిందంటే మామూలుగా ఉండదు మరి.. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోయే ఛాన్స్ ఉంది. అందుకే తేనెటీగలంటేనే ఆమడదూరం పరిగెడతారు. తేనెటీగ కుట్టిందంటే ఆ నొప్పిని భరించడం చాలా కష్టం, అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా వేల సంఖ్యలో తేనెటీగలను ఒంటినిండా నింపుకొని హాయిగా నవ్వుతూ నిల్చున్నాడు. తేనెటీగలు ఇతని నేస్తాలా.. అతన్ని అవి కుట్టవా.. ఒకవేళ కుట్టినా అతనికేమీ కాదా..నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి ఒంటినిండా తేనెటీగలతో ఇలా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు.
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం, దాసరిపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖాజా రియాజ్ అనే యువకుడు ప్రస్తుతం ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారాడు. అందరూ తేనెటీగలను చూసి భయపడితే, ఇతను మాత్రం వాటితో స్నేహం చేస్తున్నాడు. తేనెటీగలు కుట్టకుండా ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండానే, కేవలం చేతులతో వేల కొద్దీ తేనెటీగలను ఒంటిపైకి ఎక్కించుకుంటూ, వాటిని నిమురుతూ ఆడుకుంటున్నాడు. తేనెటీగలు కుట్టకుండా అతని వద్ద ఏమైనా మంత్రతంత్రాలు ఉన్నాయా…అంటే అలాంటివేమీ లేవు.. ఇది దేవుడు ప్రసాదించిన వరం అంటున్నాడు. ఎలాంటి భయం లేకుండా తేనెతుట్టెలను మెడలో వేసుకుంటున్నాడు.. చేతులతో పట్టుకుంటున్నాడు. తేనెటీగలు చుట్టూ ముసిరినా ఏమాత్రం భయపడటంలేదు. అతని ధైర్యాన్ని చూసి దాసరిపల్లి గ్రామస్తులు నోరెళ్లబెడుతున్నారు. అంతేకాదు.. అతన్ని హనీమ్యాన్ అని పిలుచుకుంటున్నారు. రియాజ్ చేసిన ఈ సాహస కృత్యాలను వీడియోలుగా తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో, అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. వేల సంఖ్యలో తేనెటీగలు ఒక మనిషిపై వాలినా ఏమీ కాకపోవడం పట్ల నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రకృతి వింతేనా లేక అతనికున్న ప్రత్యేక శక్తా? అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఏది ఏమైనా, నెల్లూరు ‘హనీ మ్యాన్’ వీడియోలు ప్రస్తుతం నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి!
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్
భార్య వదిలి వెళ్లిపోయింది.. ‘AI జెమిని’ సలహా ఏంటంటే..
వేసవి వేడికి.. ఏసీ లేకుండానే ఇల్లంతా చల్లగా
ఇన్‌స్టా రీల్ చూసి ఉమ్మెత్త ఆకులు కూర చేసి తిన్నారు.. ఆ తర్వాత
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్ మెషీన్లో పెట్టి.

