AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వామ్మో.. ఇన్ని బైకులు కొట్టేశారేంట్రా.. షోరూమ్‌ పెడతారా ఏంటి?

వామ్మో.. ఇన్ని బైకులు కొట్టేశారేంట్రా.. షోరూమ్‌ పెడతారా ఏంటి?

Samatha J
|

Updated on: Apr 26, 2026 | 6:10 PM

Share

హైదరాబాద్‌ నగరంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లలో చొరబడి బంగారం, డబ్బు కొట్టేసేవాళ్లు కొందరైతే.. ఇంటిముందు పార్క్ చేసిన వాహనాలను కొట్టేసేవాళ్లు కొందరు. ఈ దొంగలు నగర జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. నగరంలో ఎక్కడైనా బైక్‌ పార్క్‌ చేయాలంటే భయపడే పరిస్థితి. అలా పార్క్‌ చేసిన వాహనాలను కొట్టేసి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ ఘరానా దొంగలను సైబరాబాద్‌ పోలీసులు పట్టుకుని కటకటాల వెనక్కి పంపారు. ఈ దొంగల ముఠాను పట్టుకోడానికి పోలీసులు ఏకంగా 200 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించాల్సి వచ్చింది.

సైబరాబాద్ కమిషనరేట్ పోలీస్‌ స్టేషన్లపరిధిలో వరుసగా బైక్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు కొందరు దుండగులు. బి.నవీన్ , టి.శ్రీనివాస్. అరు ఈ ఇద్దరు దొంగలు కలిసి నగరంలో పలుచోట్ల పార్క్‌ చేసి ఉంచిన 24 ద్విచక్ర వాహనాలను ఎత్తుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ. 12 లక్షలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు, వీరు దొంగిలించిన బైకులను కొనుగోలు చేసిన ఎం. రమేష్, ఎం. శ్రీకాంత్‌లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అత్యాధునిక టెక్నాలజీ సాయంతో పోలీసులు ఈ దొంగల ముఠాను అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 23న గండిమైసమ్మ జంక్షన్ వద్ద పోలీసులు దాదాపు 200 సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టారు. నిందితుల ప్రతి కదలికను గమనిస్తూ, కూపీ లాగి మరీ వారిని పట్టుకున్నారు. టెక్నాలజీని ఉపయోగించడం వల్లనే దొంగలను పట్టుకోగలిగామని పోలీసులు తెలిపారు. ఈ అరెస్టులతో స్థానికంగా బైక్ దొంగతనాలు తగ్గుతాయని దుండిగల్ ఎస్ఐ.. ఎస్.రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వాహనదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ కోరారు. వాహనాలను ఎక్కడ పార్క్ చేసినా కచ్చితంగా హ్యాండిల్ లాక్ చేయడం మర్చిపోవద్దని సూచించారు. సెక్యూరిటీ ఎక్కువగా ఉండే చోట పార్క్ చేయాలని, సీసీ కెమెరాల నిఘా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నిందితులను రిమాండ్‌కు తరలించి, మరిన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. టెక్నాలజీ సాయంతో క్రైమ్‌ను కట్టడి చేయడంలో సైబరాబాద్ పోలీసుల కృషిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

రీ రిలీజ్‌లైనా చేయొచ్చుగా..సమ్మర్‌ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు

చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు

ధురంధర్‌ జోరుకు బ్రేక్‌ వేసిందెవరు..?

క్లాస్‌ టు మాస్‌.. మాస్‌ టు క్లాస్‌ రూటు మారుస్తున్న టాప్‌ స్టార్స్‌

Follow Us