Khammam: ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేస్తుండగా ఇలా అయింది ఏంటి..?
సారపాకలో వినాయక ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన సమయంలో అపశృతి చోటుచేసుకుంది. క్రేన్‌తో ప్రతిష్టిస్తున్న ధ్వజస్తంభం ఒక్కసారిగా విరిగి పడడంతో ముగ్గురు గాయపడ్డారు. భక్తులు అప్రమత్తంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. భద్రతా లోపాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. .. ..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. ప్రధాన రహదారి పక్కన ఉన్న స్థానిక వినాయక ఆలయంలో ధ్వజస్తంభాన్ని పునః ప్రతిష్టాపన చేస్తుండగా, ఒక్కసారిగా అది విరిగి పడింది. క్రేన్ సహాయంతో ప్రతిష్టాపన చేస్తున్న సమయంలో ధ్వజస్తంభం మూడు ముక్కలై కూలిపోయింది.
ఆ సమయంలో అక్కడున్న భక్తులపై నేరుగా పడే పరిస్థితి ఏర్పడినా, వారు అప్రమత్తంగా తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఒక యువతి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ నిర్వాహకులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
94 ఏళ్ల తాత జీవన పాఠాలు వైరల్
స్టాన్ఫోర్డ్ డిగ్రీ, గూగుల్ ఇంటర్న్.. అయినా దొరకని ఉద్యోగం
లైట్ ఆన్, ఆఫ్ చేస్తే చాలు.. ఏడాదికి రూ.30 కోట్ల జీతం!
ఎండల నుంచి తప్పించుకోవడానికి పిచ్చుక మాస్టర్ ప్లాన్
వింత గొడవ.. పట్టణాన్ని ముప్పుతిప్పలు పెడుతున్న నెమళ్లు
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..

