Love Story: వాకింగ్ లో పరిచయం.. 70 ఏళ్ల వ్యక్తి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న 19 ఏళ్ల యువతి.. ప్రేమ గుడ్డిది అంటోన్న నెటిజన్లు..
పాకిస్థాన్‌కు చెందిన లియాఖత్ అలీ అనే 70 ఏళ్ల వ్యక్తి, షుమైలా అలీ అనే 19 ఏళ్ల యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు వయసు పెద్ద అడ్డంకిగా మారింది.
కొన్ని సంఘటనలు చూసినప్పుడు లేదా విన్నా ప్రేమ గుడ్డిది అనే మాట నిజమే అనిపిస్తుంది. ప్రేమ మతం, దేశం, భాష, వయసు అనే హద్దులు దాటి ప్రేమించిన వ్యక్తి చేతిని అందుకుంటుంది. పాకిస్థాన్ కు చెందిన 70 ఏళ్ల వ్యక్తి 19 ఏళ్ల యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వయోపరిమితి దాటిన ఈ ప్రేమికులు ఇప్పుడు జంటగా మారారు. వివరాల్లోకి వెళ్తే..
పాకిస్థాన్‌కు చెందిన లియాఖత్ అలీ అనే 70 ఏళ్ల వ్యక్తి, షుమైలా అలీ అనే 19 ఏళ్ల యువతి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమకు వయసు పెద్ద అడ్డంకిగా మారింది. పాకిస్థానీ యూట్యూబర్ సయ్యద్ బాసిత్ అలీ ప్రేమకథను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత.. ఈ జంట సోషల్ మీడియాలో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
షుమైలా అలీ తన కంటే దాదాపు 50 ఏళ్లు పెద్ద వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అంతేకాదు తాను ఈ పెళ్లితో చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. తన తాత వయసులో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తన కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించలేదని షుమైలా పేర్కొంది. అయినా పట్టు వదలకుండా పెళ్లి చేసుకుంది. కాగా, వీరిద్దరి ప్రేమ వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. షుమైలా ఉదయం వాకింగ్ చేస్తున్నప్పుడు లియాఖత్ అలీని కలుసుకున్నారు. అలా ఏర్పడిన పరిచయంతో రోజూ అతనిని కలవడానికి వాకింగ్‌కు వెళ్ళేది షుమైలా. ఆ నడక ఇద్దరి జీవితాల్లో కొత్త మలుపు తిరిగింది. ఇద్దరం కలిసి పార్కులో వాకింగ్ చేసి ఇప్పుడు కలిసి జీవితంలో అడుగులు వేస్తున్నారు.
లాహోర్‌కు చెందిన ఈ జంట వయస్సు పరిమితి ఉన్నప్పటికీ సంతోషంగా జీవిస్తున్నారు. షుమైలాను ఇష్టపడిన లియాఖత్ అలీ ఆమెకు ప్రపోజ్ చేశాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. ప్రేమ ఎలా పుడుతుందో ఎవరూ చెప్పలేరన్నది ఆయన అనుభవం.
గతంలో వీరి పెళ్లిని వ్యతిరేకించిన వారి తల్లిదండ్రులు ఇప్పుడు అంగీకరించారు. 70 ఏళ్ల లియాఖత్, వయసులో వృద్ధుడు.. కానీ హృదయంలో చాలా చిన్నవాడని చెబుతోంది షుమైలా. తనను చాలా ప్రేమగా చూసుకుంటాడని హర్షం వ్యక్తం చేస్తోంది. పెళ్లికి వయసు ముఖ్యం కాదని, చట్టబద్ధంగా పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఉన్న ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చని అంటున్నారు ఈ ప్రేమికులు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..