ఇప్పటికే ఐదుగురు భర్తలు.. మరో యువకుడిని ముగ్గులోకి దించి కటకటాల పాలైన మహిళ

ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటూ ఇప్పటికే ఐదుగురు భర్తలకు భార్య అయింది. అది కూడా ఎవరికీ విడాకులు ఇవ్వకుండా..వీరిని పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు ఎమిలీ హృదయం మరో వ్యక్తిని వలచింది. దీంతో అతడితో బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఎమిలీ అబద్ధం ఎక్కువ కాలం దాగలేదు

ఇప్పటికే ఐదుగురు భర్తలు.. మరో యువకుడిని ముగ్గులోకి దించి కటకటాల పాలైన మహిళ
Bigamist Bride
Follow us
Surya Kala

|

Updated on: Nov 12, 2022 | 1:19 PM

ప్రేమ గుడ్డిది అని అంటారు. ప్రేమ వయస్సు, కులం, మతం, ఆస్థి, అంతస్తులను చూడదు. అందుకే ఒక్కోసారి ప్రేమకు సంబంధించిన వింత కథనాలు తెరపైకి వస్తాయి. కొన్ని ప్రేమలు పెళ్లిళ్ల గురించి తెలుసుకుని ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ఎవరు, ఎప్పుడు, ఎవరితో ప్రేమలో పడతారో ఎవరికీ తెలియదు.  తన హృదయం ఎవరిని వరిస్తుందో.. వారితో జీవితాంతం గడపాలని.. కోరుకుంటాడు. అయితే ప్రేమ నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాలలో నమ్మకాన్ని వమ్ము చేయడంతో సంబంధాలు విచ్ఛిన్నమవుతాయి. అలాంటి కథే ఒకటి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. నిజమైన ప్రేమ ఎవరికైనా జీవితంలో ఒక్కసారే కలుగుతుందని అంటారు. అయితే ఈ సామెత చాలా మందికి సరిపోదు. ఎందుకంటే  కొంతమంది ఒకరి తర్వాత ఒకరిని ప్రేమిస్తూనే ఉంటారు. అంతేకాదు ఒకరికి తెలియకుండా ఒకరిని పెళ్లి చేసుకున్న ఘటనలకు సంబంధించిన వార్తలను తరచుగా వింటూనే ఉన్నాం.. తాజాగా ఇటువంటి ఓ కథనం ఒకటి వెలుగులోకి వచ్చింది. బ్రిటన్ నివాసి ఎమిలీకి ఇప్పటికే ఐదుగురు భర్తలు ఉన్నారు. ఒకరి తర్వాత మరొకరు పెళ్లి చేసుకుంటూ ఇప్పటికే ఐదుగురు భర్తలకు భార్య అయింది. అది కూడా ఎవరికీ విడాకులు ఇవ్వకుండా..వీరిని పెళ్లి చేసుకుంది. అయితే ఇప్పుడు ఎమిలీ హృదయం మరో వ్యక్తిని వలచింది. దీంతో అతడితో బంధాన్ని ఏర్పరచుకుంది. అయితే ఎమిలీ అబద్ధం ఎక్కువ కాలం దాగలేదు. ఆమె చేసిన మోసం బయటపడి.. ఇప్పుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అబద్ధాల పునాదిపై ఏర్పడిన బంధం: ఎమిలీ ఆరవ భర్త వేన్ హార్పర్ ఓ ఇంటర్వ్యూలో మహిళతో తనకున్న సంబంధాన్ని వెల్లడించాడు. తాను ఎమిలీ హార్న్‌తో 18 నెలలుగా సంబంధం కలిగి ఉన్నానని..  అయితే ఆమె అబద్ధ జీవితం తనకు తెలిసిందని.. అందుకనే వెంటనే ఎమిలీతో ఉన్న సంబంధాన్ని తెంచుకుని ఆ మహిళతో విడిపోయినట్లు చెప్పాడు. తన ఆస్పత్రిలో ఓ చిన్న ఆపరేషన్‌ జరిగిందని.. ఆ సమయంలో తనకు ఎమిలీతో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. అప్పుడు మా మధ్య మాటలు ప్రారంభమయ్యాయి.. ఒకరినొకరం ప్రేమించుకున్నాం.. తర్వాత జీవితాంతం కలిసి బతకాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎమిలీ తనను మోసం చేస్తున్నదనే విషయం 18 నెలల తర్వాత తనకు తెలిసిందని వేన్ చెప్పాడు. వెంటనే ఎమిలీ గురించి దర్యాప్తు చేయగా.. ఎమిలీకి అప్పటికే ఐదుగురు భర్తలు ఉన్నారని తనకు తెలిసిందని చెప్పాడు వేన్.

ది సన్‌ వార్తా పత్రికతో వేన్ మాట్లాడుతూ.. తన వైవాహిక జీవితం సుఖంగా లేదని చెప్పాడు. తన దగ్గర ఆమె జ్ఞాపకాలు లేవు, ఫోటోలు లేవు, ఏమీ లేవు. మా  సంబంధం మోసం అనే పునాదిపై ఏర్పడింది. నిజం తెరపైకి వచ్చిన వెంటనే కూలిపోయింది. అంతే కాకుండా ఎమిలీ అడల్ట్ సినిమాల్లో కూడా పనిచేసిందని తెలిసి తాను షాక్ తిన్నట్లు చెప్పాడు. ఒకరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకున్న కేసులో ఎమిలీ దోషిగా తేలడంతో కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..