Twitter Blue Check: బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసును నిలిపివేసిన ట్విటర్‌! తలలు పట్టుకుంటున్న యూజర్లు..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Nov 12, 2022 | 1:38 PM

ట్విటర్‌లో బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసుపై దాని కొత్త యమజాని ఎలాన్‌ మస్క్ యూటర్న్‌ తీసుకున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ వెసులుబాటు కల్పించిన మస్క్‌ అనతికాలంలోనే ఈ సర్వీసును నిలివేశారు..

Twitter Blue Check: బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసును నిలిపివేసిన ట్విటర్‌! తలలు పట్టుకుంటున్న యూజర్లు..
Twitter Blue Mark unavailable

ట్విటర్‌లో బ్లూ టిక్‌ ప్రీమియం సర్వీసుపై దాని కొత్త యమజాని ఎలాన్‌ మస్క్ యూటర్న్‌ తీసుకున్నారు. నెలకు 8 డాలర్లు చెల్లించి బ్లూ టిక్‌ వెసులుబాటు కల్పించిన మస్క్‌ అనతికాలంలోనే ఈ సర్వీసును నిలివేశారు. అందుకు కారణం లేకపోలేదు. దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేసినట్లు ట్విటర్‌ వెల్లడించింది. కాగా ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం నుంచే యూజర్లకు ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ కన్పించట్లేదని వెల్లడించారు.

రెండువారాల క్రితం బిలియనీరైన మస్క్‌ ట్విటర్‌ను కొనుగోలు చేయకముందు సెలబ్రెటీలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖ వ్యక్తుల అకౌంట్లను వెరిఫై చేసి బ్లూ టిక్‌ కేటాయించేవారు. ఇది పాత పద్ధతి. దీంతో ఆయా అకౌంట్లకు నకిళీలు లేకుండా ఉండేవి. ఐతే ట్విటర్‌ మస్క్‌ చేతికొచ్చాక ఈ బ్లూ టిక్‌ సర్వీసును నెలవారీ ఛార్జీ చెల్లింపులతో ప్రీమియం సర్వీస్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చారు. ఇలా ఛార్జ్‌ చేసిన వారికి ఎటువంటి వెరిఫికేషన్‌ నిర్వహించకుండా బ్లూటిక్‌ ఫెసిలిటీ ఇచ్చారు. దీంతో ప్రముఖ వ్యాపార సంస్థలు, సెలబ్రెటీలకు సంబంధించిన ఫేక్ ఖాతాలు ట్విటర్‌ ప్లాట్‌ఫారమ్‌పైకి పరుగులు పెట్టాయి. దీంతో నకిళీ ఏదో, అసలు ఏదో తెలియక తికమకం ప్రారంభమైంది. దీనిపై కొన్ని వ్యాపార సంస్థలు ఫిర్యాదు చేయండతో బ్లూటిక్‌ సర్వీస్‌ను నిలిపివేశారు.

అలాగే ‘ఆఫీషియల్‌’ అనే బూడిద రంగు లేబుల్‌ను కొన్ని ప్రముఖ సంస్థలకు ఈ వారంలోనే కేటాయించింది. ఐతే దీనిని కూడా గంటల వ్యవధిలోనే తొలగించింది. తిరిగి గురువారం రాత్రి నుంచి ఈ సేవలను పునఃప్రారంభించింది. అమెజాన్‌, కోక-కోలా వంటి పెద్ద కంపెనీలకు మాత్రమే కేటాయించింది. సెలబ్రెటీలకు ఇంకా దీనిని ఇవ్వలేదు. ఎప్పుడు ఇస్తారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు. ఏదిఏమైనా ట్విటర్‌లో మస్క్‌ తీసుకొస్తున్న మార్పులు ప్రారంభకాలంలోనే ఒడిదుడుకులకు గురికావడంపై సర్వత్రా చర్చలు సాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu