ఆస్ట్రేలియాలోని ఆర్మిడేల్‌లోని న్యూ ఇంగ్లండ్ యూనివర్సిటీకి చెందిన ఆర్నిథాలజిస్ట్ జిసెలా కప్లాన్ పక్షులపై చేసిన అధ్యయనంలో సరికొత్త విషయాలను కనుగొన్నారు. అవేంటంటే.. పక్షులు చాలా దూరం ప్రయాణించినప్పుడు, అవి వివిధ రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటాయి. ఇది పక్షుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. కొన్నిసార్లు వాటి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి భాగస్వామి వద్దకు రావడం కష్టమైపోతుంది. పక్షుల ఆహార సేకరన, సంతానోత్పత్తికి నిరాకన వంటి సందర్భాల్లో కూడా సదరు పక్షి తన భాగస్వామిని విడిచిపెట్టి తన దారి తాను చూసుకుంటుంది. కాలుష్యం, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, అకాల విపత్తులు, తుఫానుల వంటి కారణాలు కూడా పక్షుల్లో విడాకుల సమస్య పెరిగిపోతోంది. ఈ కారణాల వల్ల పక్షుల్లో ఎగరగల సామర్థ్యం, సంతానోత్పత్తి సమస్యలు, మానసిక స్థితి దెబ్బతినటం వంటి సమస్యలు ఎదుర్కొంటాయి.